అన్వేషించండి

Google AI Data Center in Vizag: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. రూ.87 వేల కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్

AP Chandrababu | ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ తో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Vizag AI Data Center | న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ (Google) అనుబంధ సంస్థ రైడెన్ ప్రతినిధులు, ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో  గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌తో జరిగిన భేటీలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, నారా లోకేష్ పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఒప్పందంతో విశాఖలో ఒకేసారి ఏకంగా రూ.రూ.87,520 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రానున్నాయి. ఏపీలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ప్రభుత్వం తెలిపింది.

న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ 1 గిగావాట్ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఏపీప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుంది. వైజాగ్‌ను ఏఐ సిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో భాగంగా గూగుల్ తో చేసుకున్న ఒప్పందంతో విశాఖకు 10 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి.

Image

ఏ రంగాల్లో సేవలు అందిస్తుంది..

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి భారత్ ఏఐ శక్తి పేరుతో సమావేశం జరిగింది. గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి హజరైన గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా కొందరు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్ధతో ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నామని గూగుల్ తెలిపింది. ఏఐ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానునంది. 

విదేశాలకు విశాఖ ద్వారా కనెక్టివిటీ.. గూగుల్ క్లౌడ్ సీఈఓ

గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ.. ‘గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ మారుతుంది. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాం. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. జెమినీ-ఏఐ (Gemini AI)తో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి.

Image

డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఐదేళ్లల్లో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. భారత దేశానికే కాదు... విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక అవుతుందని’ ధీమా వ్యక్తం చేశారు.

Group of six men and one woman in formal Indian attire including kurtas, sarees, suits, and vests stand smiling for a photo in an indoor venue with white walls, a chandelier, and backdrop banners displaying AI for India logo, G20 emblem, and event text. The individuals include an elderly man in cream kurta, a woman in red saree, a man in beige kurta, a younger man in maroon vest, another in blue suit, and two in suits with ties. Setting appears to be a conference or summit room with modern lighting and decor.

అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వతేదీన రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో లో గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. అందుకు గూగుల్ అంగీకరించింది. నేడు ఒప్పందంపై సంతకాలు చేశారు.

Image

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Advertisement

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget