అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

KA Paul : 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిప్పుతున్నారు, ఆ లాయర్స్ లైసెన్స్ రద్దు చేయండి- కేఏ పాల్

KA Paul : ఓ ట్రస్ట్ విషయంలో పాత కేసులను తిరగతోడుతున్నారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. 16 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారన్నారు.

KA Paul : ఓ ట్రస్ట్ వివాదంలో  16 ఏళ్లుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. డిస్మిస్ అయిన కేసులను కొందరు న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగా తిరగతోడుతున్నారని ఆరోపించారు. తన కేసులో సత్వర న్యాయం కోసం అభ్యర్ధిస్తున్నానన్నారు. ఈ కేసు కారణంగా ఎంతో మంది వితంతువులు, అనాథలకు అందాల్సిన సాయం ఆగిపోయిందన్నారు. ఈ కేసులో పరిష్కారం లభించకపోతే నిరాహారదీక్ష చేస్తానన్నారు. కోర్టు సమయం వృధా చేస్తున్న న్యాయవాదులపై సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు ఫిర్యాదు చేస్తానన్నారు.  

16 ఏళ్లుగా నడుస్తున్న కేసు 

"మన దేశంలో ఉన్న అవినీతి ఇంకెక్కడా లేదు. అందుకు ఈ కేసు నిదర్శనం. 2007 నుంచి ఈ కేసు నడుస్తుంది. ట్రస్ట్ విషయంలో మా వదిన, వాళ్ల పిల్లలు 17 కేసులు పెట్టారు. అందులో 16 కేసులు డిస్మిస్ అయ్యాయి. మరి విశాఖలోని ఈ కేసు ఎందుకు డిస్మిస్ అవ్వడంలేదు. 16 ఏళ్లుగా ఈ కేసును విచారిస్తున్నారు. 2014లో హైకోర్టు ఆ కేసును మూడు నెలలో డిస్మిస్ చేయాలని ఆదేశించింది. మళ్లీ పిటిషన్ చేస్తే 2016లో డిస్మిస్ చేశారు. ఈ ట్రస్టు విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లారు. ప్రతిచోట వాళ్లకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. కానీ విశాఖలో మాత్రం 16 ఏళ్లుగా కేసు నడుస్తోంది. కొందరు న్యాయవాదులు అక్రమంగా పాత కేసులను తిరగతోడుతున్నారు. ఇలాంటి న్యాయవాదుల లైసెన్స్ రద్దు చేయాలని బార్ కౌన్సిల్ ను కోరుతున్నారు. కేఏ పాల్ అఫిషియల్ యాప్ లో నాకు ఫిర్యాదు చేయండి. మీ కేసులు ఇలా పెండింగ్ లో ఉంటే నాకు ఈ యాప్ లో తెలియజేయండి. నేను మీకోసం పోరాడతాను. నేను ప్రధానిమంత్రి అయితే పార్లమెంట్ లో బిల్లు పెడతాను. మర్డర్ కేసు అయితే ఎఫ్ఐఆర్ వన్ వీక్ లో ఫైల్ అవ్వాలి, ఛార్జ్ షీట్ ఒక నెలలో ఫైల్ అవ్వాలని చట్టం చేస్తాను. దేశంలోని పది లక్షల లాయర్స్ లో ప్రత్యేక కోర్టు పెట్టించి మూడు నుంచి ఆరు నెలల్లో నిందితులకు శిక్ష విధించేలా చేస్తాం. కోర్టులపై కేసు ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తాను. డిసెంబర్ 28 లోపు మీ కేసుల వివరాలు నాకు పంపిస్తే నేను మీ కోసం పోరాటం చేస్తాను. " 

లక్షల మందికి సాయం నిలిచిపోయింది

"16 ఏళ్ల నుంచి నా కాళ్లు చేతులు కట్టేశారు. ట్రస్ట్ ద్వారా లక్షల మందికి సాయం నిలిచిపోయింది. ఎందుకు కొందరు దొడ్డిదారిన కేసును ఓపెన్ చేయిస్తున్నారు. ఎందుకు వందల సార్లు వాయిదా విధించారు. వీటన్నింటిపై పోరాటం చేస్తాను. అవసరమైతే నిరాహార దీక్షకు దిగుతాను" అని కేఏ పాల్ అన్నారు. తన కేసుతో పాటు, ఏళ్ల తరబడి కోర్టు కేసులతో తిరుగుతున్న వాళ్ల కోసం నిరసన చేస్తానని కేఏ పాల్ చెప్పారు. అందుకు కోసం తన యాప్ లో సమాచారం అందిస్తే వాటిని హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. బాధితులకు న్యాయం సత్వరమే జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతానన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget