అన్వేషించండి

TDP News: సిట్ ఆఫీసు వద్ద కీలక ఫైల్స్ దగ్ధం! అవి చంద్రబాబు అక్రమ కేసుల పత్రాలేనా?

AP Latest News in Telugu: సిట్ కార్యాలయంలో చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులకి సంబంధించిన ఫైల్స్ కాల్చేశారని టీడీపీ ఓ పోస్టు చేసింది. ఫైల్స్ కాల్చివేతకు సంబంధించి ఓ వీడియోను కూడా జత చేసింది.

Chandrababu News: ఏపీలో ఎన్నికల వేళ కొత్త అంశం చర్చనీయాంశం అవుతోంది. గతేడాది విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన అక్రమ కేసులకు సంబంధించిన ఫైల్స్ ను అధికార పార్టీ కనుమరుగు చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సిట్ కార్యాలయంలో చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులకి సంబంధించిన ఫైల్స్ కాల్చేశారని టీడీపీ ఓ పోస్టు చేసింది. ఫైల్స్ కాల్చివేతకు సంబంధించి ఓ వీడియోను కూడా జత చేసింది.

ఈ వ్యవహారంతో సీఐడీ అధికారులు కుట్ర చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి.. అందుకే ఇంత వరకూ అధికార పార్టీకి సహకరించిన అధికారులలో టెన్షన్ మొదలైందని టీడీపీ నేతలు కూడా వాదిస్తున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు  బనాయించడానికి సృష్టించిన నకిలీ పత్రాలను తగలబెడుతున్న వీడియో బయటకు రావడంతో సీఐడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని వారు ఆరోపణలు చేస్తున్నారు.

సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్దం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సీఐడీ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో ఈ ఫైల్స్ తగలబెట్టినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఖండించిన సీఐడీ

చంద్రబాబు అక్రమ కేసులకు సంబంధించిన ఫైల్స్‌ తగలబెట్టారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీఐడీ ఖండించింది. దీనికి సంబంధించి సీఐడీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని.. ప్రతి ఛార్జ్ షీట్‌ను 8 వేల నుంచి 10 వేల కాపీలతో రూపొందించామని వివరించారు.

ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించామని చెప్పారు. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి గతంలోనే అందజేశామని.. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందించినట్లు చెప్పారు. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించినట్లు సీఐడీ ఓ ప్రకటనలో వివరించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget