అన్వేషించండి

Rats Bite Students: కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన

A Konduru KGBV School in NTR District | ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులోని కస్తూర్భా పాఠశాలలో 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. మంత్రి సత్యకుమార్ సైతం ఈ ఘటనపై స్పందించారు.

ఎ.కొండూరు: ఏపీలో మరో గవర్నమెంట్ హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం (ఫిబ్రవరి 11న) రాత్రి డార్మెటరీలో విద్యార్థినులు నిద్రిస్తుండగా ఉండగా, కిటికీల ద్వారా లోపలికి వచ్చిన ఎలుకలు వారిపై దాడి చేశాయి. ఏడో తరగతి చదువుతున్న కావూరి కళావతి, మాల్లాది శ్యామల, చిమటా లక్ష్మీప్రసన్న, వి స్నేహ, ఎం. రజిని సహా మొత్తం 12 మంది బాలికలను ఎలుకలు కరిచాయి.

కేజీబీవీని సందర్శించిన ఉన్నతాధికారులు

ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా KGBV అధికారులు తొలుత గోప్యంగా ఉంచడానికి చూశారు. అయితే, గురువారం ఉదయం ఎలుకలు కరిచిన బాధిత బాలికలను చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించడంతో విషయం బయటపడింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మార్వో ఎన్. అరవింద్, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు, జీసీడీవో విశ్వభారతి వెంటనే కస్ఫూర్బా గాంధీ స్కూల్ (KGBV), హాస్టల్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థినుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.

హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడం కేజీబీవీలో వసతుల లేకపోవడాన్ని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని చూపుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ డార్మెటరీ కిటికీలు సరిగా లేకపోవడం వల్లే ఎలుకలు లోపలికి వచ్చాయని విద్యార్థినులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో విద్యార్థులకు చికిత్స అందించాల్సిన ఏఎన్‌ఎం పోస్టు గత ఏడాది నుంచి ఇక్కడ ఖాళీగా ఉంది. అంటే అకస్మాత్తుగా విద్యార్థులు ఏమైనా అస్వస్థతకు గురైనా వారికి త్వరగా చికిత్స అందించే అవకాశం కూడా లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సైతం డార్మెటరీలోకి ఇదే విధంగా ఎలుకలు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఈ ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. బాలికలకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్‌లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget