అన్వేషించండి

CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !

Devotee Narayana: సిపిఐ సీనియర్ నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారి విధానం ప్రకారం దేవుడు ఉండడు. దీనిపై బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మార్పు మంచిదేనని స్పందించారు.

BJP Vishnu reacts to CPI leader Narayana : దశాబ్దాల కాలంగా మార్క్సిస్ట్ సిద్ధాంతాలను, నాస్తికవాదాన్ని నమ్ముతూ, మతం ఒక మత్తుమందు అన్న కార్ల్ మార్క్స్ మాటలను తు.చ తప్పకుండా పాటించిన సీపీఐ అగ్రనేత డాక్టర్ కె. నారాయణలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ హేతువాద దృక్పథంతో దేవుడి ఉనికిని ప్రశ్నించే ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు నేత, స్వయంగా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటనే చర్చ మొదలైంది.

గడప బయట నుంచి గర్భాలయం వరకు 

గతంలో అనేకసార్లు నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చినప్పటికీ, వారు దర్శనం చేసుకునే సమయంలో ఆయన ఆలయం వెలుపలే వేచి ఉండేవారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా ఆయన భక్తితో స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా, తిరుమల లడ్డూ వివాదంపై కూడా సానుకూలంగా స్పందించారు. లడ్డూ కల్తీ జరిగిందన్నది నిజమని, అయితే దీనిపై కేవలం రాజకీయ ప్రచారం చేయడం కంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. వయసు మళ్లిన తరుణంలో ఆయన ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందా లేక ఆధ్యాత్మికత పట్ల సానుకూలత పెరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 ఇది గొప్ప జ్ఞానోదయం బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి

నారాయణ ఆధ్యాత్మిక బాట పట్టడంపై బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు  యస్. విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దశాబ్దాల పాటు దేవుడు లేడు అని నమ్మిన సిద్ధాంతం నుంచి, వయసు మళ్లిన తర్వాత అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అనే ఆధ్యాత్మిక బాటలోకి రావడం ఒక గొప్ప జ్ఞానోదయం అని ఆయన పేర్కొన్నారు. మార్క్సిస్ట్ గ్రంథాలు చదివినా దొరకని ప్రశాంతత, వేంకటేశ్వరుడి పాదాల చెంత దొరుకుతుందని నారాయణ గ్రహించడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. 

నాస్తికత్వం కేవలం యవ్వనపు ఆవేశమేనా?                           

విష్ణువర్ధన్ రెడ్డి తన విశ్లేషణలో  నాస్తికత్వం అనేది కేవలం యవ్వనపు ఆవేశం మాత్రమేనని, వయసు పెరిగే కొద్దీ ఆ పరమాత్ముని ఉనికిని కాదనలేమని ఈ దర్శనం నిరూపిస్తోంది. ఇది కేవలం రాజకీయ మలుపు కాదు, ఆత్మ కనుగొన్న సత్యం  అని అభివర్ణించారు. గతంలో గద్దర్, శ్రీశ్రీ, రాహుల్ సాంకృత్యాయన్ వంటి విప్లవ దిగ్గజాలు కూడా చివరి దశలో ఆధ్యాత్మిక లేదా సత్యం వైపు పయనించారని ఆయన గుర్తు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget