అన్వేషించండి

Napa Rayi Industry: నాపరాయి పరిశ్రమకు హ్యాపీ న్యూస్- లీజు ధరలు భారీగా తగ్గింపు, రెండు రూపాయలకే కరెంట్

Andhra Pradesh Government: నాపరాతి పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గనుల లీజ్ రెన్యువల్ చార్జీలను భారీ ఎత్తున తగ్గించింది. రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తామని ప్రకటించింది.

AP Govt Support To Napa Rayi Industry: రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నాపరాతి పరిశ్రమ (Napa Rayi Industry)కు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) గుడ్ న్యూస్ చెప్పింది. గనుల లీజ్ రెన్యువల్ చార్జీల (Mines Lease Charges)ను భారీ ఎత్తున తగ్గించింది. పరిశ్రమలకు అండగా ఉండేందుకు రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, కడప, ప్రకాశం జిల్లాల్లోని పరిశ్రమలకు మేలు కలుగనుంది. ప్రభుత్వం నిర్ణయంపై పరిశ్రమల యజమానులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో సమావేశ భవనంలో గత శనివారం నాపరాయి గనుల యజమానులతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్ (Katasani Rami Reddy)డి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy), విద్యుత్, అటవీ, భూగర్భ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి (Pocha Brahmananda Reddy), ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి (Yerrabothula Papireddy), జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్‌ (Manazir Jeelani Samoon) పాల్గొన్నారు.

సంక్షోభంలో ఉన్న నాపరాతి పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. ఒక హెక్టార్ నాపరాతి గని రెన్యువల్ ఫీజును భారీగా తగ్గించారు. 10 నుంచి ఐదు రెట్లు తగ్గిస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. దీంతో నాపరాతి గనుల యజమానులకు పెద్ద ఊరడం లభించింది. అంతేకాదు పరిశ్రమలను ఆదుకోవడానికి రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తామని భూగర్భ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అలాగే క్వారీ డెడ్ రెంటు కాల వ్యవధిపై అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.

చింతపండు, నాపరాయి పరిశ్రమలపై 15 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించడంలో ఆర్థిక మంత్రి బుగ్గన కృషి చాలా ఉందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నాపరాతి పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నాపరాయి మీద ఆధారపడి బతికే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. సీఎఫ్ఓ విషయంలో మూడేళ్ల గడువును ఐదేండ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

తగ్గిన డిమాండ్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లె, డోన్ నియోజకవర్గాలు, కడప, ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో నాపరాతి గనులు విస్తారంగా ఉన్నాయి. కొన్ని వేల కుటుంబాలు వీటిపై ఆధారపడి ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్నాయి. కానీ కాల క్రమేణా పరిశ్రమకు ఆదరణ తగ్గింది. ఒకప్పుడు నాపరాళ్లకు డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గ్రానైట్, టైల్స్, మార్బుల్స్ వినియోగంలోకి రావడంతో మార్కెట్లో నాపరాయి కొనేవారు కరువయ్యారు. 

ప్రభుత్వం పన్నులు, విద్యుత్ చార్జీలు, అనుమతుల రెన్యూవల్ చార్జీలు, రాయల్టీలతో భారం అధికమైంది. దీంతో నాపరాతి గనుల పరిశ్రమపై ఆధారపడిన బతుకుతున్న వేలాది కుటుంబాలు సంక్షోభంలో పడ్డాయి. ఎలాగైనా నాపరాతి పరిశ్రమను గట్టెక్కించాలని పలువురు నాపరాతి పరిశ్రమ యజమానులు, కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే  బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో సమావేశ భవనంలో శనివారం నాపరాయి గనుల యజమానులతో  ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget