అన్వేషించండి

YS Sharmila: ఏపీలో ఆరోగ్య‌శ్రీని అమ‌లు చేస్తారా లేదా? నిలదీసిన వైఎస్ ష‌ర్మిల 

AP News: ఆరోగ్య‌శ్రీ అమ‌లుపై నెల‌కొన్న అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం అమ‌లు చేయాల‌నుకోవ‌డం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యంపై అనుమానాలున్నాయ‌న్నారు.

YS Sharmila Comments: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మ‌సాని మాట‌లు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని శాశ్వ‌తంగా లేకుండా చేసేలా ఉన్నాయ‌ని ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల అనుమానం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భార‌త్ కార్డులు ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల‌ని చెప్ప‌డం ఈ అనుమానాల‌కు బ‌లం చేకూర్చేలా ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కానికి కూడా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌క‌మే ప్రేర‌ణ అని ఆమె పేర్కొన్నారు. ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వంపై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. పేద ప్ర‌జ‌ల‌కు సంజీవ‌నిగా నిలిచిన ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేయ‌బోతున్నారా అంటూ సీఎం చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. మంత్రి మాట‌లు చూస్తుంటే ప‌థ‌కానికి పొగ‌పెట్టేలా ఉన్నాయ‌ని ఆమె అభిప్రాయం వ్య‌క్తం చేశారు. త‌న పోస్టులో కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌, ఏపీ బీజేపీని, ఏపీ టీడీపీని ట్యాగ్ చేశారు. గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిలు రూ. 1600 కోట్లు వెంట‌నే విడుద‌ల చేసి ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను వెంట‌నే పున‌రుద్ధరించాల‌ని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు. 

ష‌ర్మిల్ ట్వీట్ ఇదీ

‘‘ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా ? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా ? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా ? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా ? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం ? ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా ? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా ? గత YCP ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి @ncbn చంద్రబాబు గారు, @PawanKalyan పవన్ కల్యాణ్ గారు వెంటనే సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ  డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకం.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra క్లారిటీ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని షర్మిల ట్వీట్ చేశారు.

నిన్న కేంద్రం మంత్రి పెమ్మ‌సాని ఆరోగ్యశ్రీ ప‌థ‌కం అమ‌లు గురించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని గురించి మాట్లాడుతూ ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని వినియోగించుకోవాల‌ని చెప్ప‌డంపై నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆరోగ్య‌శ్రీ గురించి ఆయ‌న మాట్లాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారితీసింది. ప‌థ‌కం అమలు జ‌రుగుతుందా లేదా అని కూడా ఎక్స్‌లో  ప‌లువురు పోల్స్  నిర్వ‌హిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget