అన్వేషించండి

Vijayawada Pipe Leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీక్, చిన్నారులకు అస్వస్థత

Vijayawada Pipe leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీకవడంతో చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

Vijayawada Pipe leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీకవడంతో చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన  విజయవాడలో చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీకవడంతో చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన  విజయవాడలో చోటుచేసుకుంది. 11వ తేదీన ఏలూరులో జరిగే అండర్ 14 అండర్ 17 స్విమ్మింగ్ పోటీలకు ఇక్కడే ఔత్సాహిక స్విమర్లు సన్నద్ధమవుతున్నారు.  ఈ నెల 7 వ తేదీ సాయంత్రం నగరపాలక సంస్థ ఆధీనంలోని స్విమ్మింగ్ పూల్ లో  కోచ్,....పిల్లలు తల్లిదండ్రులతో  స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో శిక్షణ ఇస్తున్నారు. అదే సమయంలో ... క్లోరినేషన్ కోసం సిబ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. స్విమ్మర్లంతా వెళ్ళిపోయాక క్లోరిన్ కలిపేందుకు ఎదురుచూస్తున్నారు. ఇంతలో క్లోరిన్ పైపు లీక్ కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈత నేర్చుకుంటున్న చిన్నారులంతా క్లోరిన్ తీవ్రతకు అస్వస్థతకు గురి అయ్యారు. దాదాపు పదిమంది  క్లోరిన్ వాసన పీల్చి గొంతు నొప్పి తోను ఊపిరి అందని పరిస్థితికి లోనయ్యారు. కొందరు దగ్గు, వాంతులు కూడా చేసుకున్నారు. వీరందరినీ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి  చికిత్స చేయించడంతో క్రమంగా కోలుకున్నారు.

గతంలోనూ 

క్లోరిన్ ట్యాంకు నుంచి స్విమ్మింగ్ పూల్లోకి క్లోరిన్ కలిపే పైపు  లీకవడం వల్ల ఈ ఘటన జరిగిట్లు తల్లిదండ్రులు, స్థానికులు  చెబుతున్నారు.  చిన్నపాటి సమస్యలతో అందరూ కోల్పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్విమ్మింగ్ పూల్ లో ఈ తరహా ఘటనలు జరగడం కొత్తేమీ కాదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో క్లోరినేషన్ జరుగుతున్న సమయంలో పైప్ లీకై స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలోని మొక్కలు మాడిపోయిన ఘటనను  ప్రస్తావించారు. గతంలో ఓ బాలుడు కూడా క్లోరినేషన్ దాటికి గురై ఆస్పత్రి పాలయ్యాడని గుర్తుచేశారు.  కార్పొరేషన్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. కోటి 60 లక్షల రూపాయలతో స్విమ్మింగ్ పూల్ ను ఆధునికరించామని ప్రకటిస్తున్న ప్రజాప్రతినిధులు చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించే అంశాలపై దృష్టి సారించడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ టైల్స్ మార్చడం మినహా మరేమీ చేయలేదని తల్లిదండ్రుల ఆరోపించారు. దశాబ్దాల క్రితం నుంచి ఉంటున్న పైపు మార్చకపోవడంతో దాని రబ్బరు తొడుగు పాడై క్లోరిన్ లీకైనట్లు చెబుతున్నారు. అత్యంత అవసరమైన ఇలాంటి మరమత్తులు చేయకుండా పైపై మెరుగులు దిద్దడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  జరిగిన ఘటనల నుంచి అధికారులు గుణపాటాలు నేర్చుకుని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


క్లోరిన్ ఘటనలో కుట్ర కోణం 


ఈ ఘటనపై మరో వాదన కూడా వినిపిస్తోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ స్విమ్మింగ్ పూల్ లో ప్రైవేటు అసోసియేషన్ల ఆధిపత్య ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు  ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ కొత్త ఇన్చార్జిపై కుట్రతో కొందరు..... క్లోరిన్ ను లీక్ చేసే విధంగా కుట్రపన్నారని ఆరోపిస్తున్నారు.  నగరపాలక సంస్థ అధికారులతో పాటు,  జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించాలని స్ధానికులు కోరుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు.. అధికారులకు ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
Chandrababu Pawan Kalyan Meeting: చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
చంద్రబాబుతో ముగిసిన పవన్‌ కళ్యాణ్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై చర్చ
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Embed widget