Top Headlines Today: ఏపీలో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం- బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వివేక్!
Top 5 Telugu Headlines Today 1 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 1 November 2023:
తెలంగాణలో బీజేపీకి షాక్- కాంగ్రెస్‌లోకి వివేక్, కుమారుడు వంశీ
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఆయనతోపాటు కుమారుడు వంశీ కూడా రాజీనామా చేశారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఖర్గేతో ఫోన్‌లో మంతనాలు జరిపిన వివేక్.. రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. నోవాటెల్ హోటల్‌లో బస చేసిన రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆయనతోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్.. తెలంగాణ రాక్షస పాలన అంతమొందించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్నికల్లో విజయం కోసం రాజశ్యామల యాగం - సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రారంభం !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా మూడు రోజుల పాటు ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో యాగం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగం జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు రుత్విక్కులు పాల్గొంటున్నారు. మంగళవారం సాయంత్రం 200 మంది వైదికులు ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలుగువాడి గుండె ధైర్యానికి నిలువెత్తు రూపం రాజశేఖర్‌రెడ్డి- వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానంలో జగన్ కామెంట్
తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి పల్లెలు, పేదలు, రైతుల మీద మమకారానికి, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వైఎస్సార్ అని అభిప్రాయపడ్డారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఏ– కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానంలో పాల్గొన్న జగన్... తన తండ్రి గొప్పదనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. అవార్డుల ప్రదానం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్... ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సొంత గూటికి చేరుకున్న రామ్మోహన్ గౌడ్- హరీష్ సమక్షంలో చేరిక
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఏ నాయకుడు ఏ క్షణంలో ఏ పార్టీలోకి వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల టికెట్లు ఆశించిన వారంతా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్‌లో వాతావరణం కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వంతు వచ్చింది. అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న కొద్దీ జంపింగ్ జంపాంగ్‌లు పెరిగిపోతున్నారు. అలాంటి జాబితాలో చేరారు ఎల్బీనగర్ లీడర్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు. గతంలో వీళ్లు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ అక్కడ సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి కారు ఎక్కడంతో వీళ్లు కారు దిగేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అరెస్ట్ చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్‌ను మరంత పెంచిందా ? కక్ష సాధింపేనని టీడీపీ వాదనను ప్రజలు నమ్ముతున్నారా ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 53 రోజులకు జైలు నుంచి బయటకు వచ్చారు. 53 రోజుల కిందట రాజకీయ పర్యటనలో ఉన్న ఆయనను కర్నూలులో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పలేదు. ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేదు. చివరికి అరెస్టు చేసిన తర్వాత స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు అని చెప్పి కోర్టులో ప్రవేశ పెట్టారు. అప్పట్నుంచి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ క్వాష్, బెయిల్ పిటిషన్లపై విచారణలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి