అన్వేషించండి

తెలుగువాడి గుండె ధైర్యానికి నిలువెత్తు రూపం రాజశేఖర్‌రెడ్డి- వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానంలో జగన్ కామెంట్

YSR Achievement Awards: విజయవాడ వేదికగా వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం పాల్గొన్నారు.

YSR Achievement Awards: తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి పల్లెలు, పేదలు, రైతుల మీద మమకారానికి, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వైఎస్సార్‌ అని అభిప్రాయపడ్డారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఏ– కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానంలో పాల్గొన్న జగన్‌... తన తండ్రి గొప్పదనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. 

అవార్డుల ప్రదానం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్... ఆంధ్రప్రదేశ్‌ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. వరుసగా ఈరోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్ధాలుగా సుసంపన్నం చేసిన ప్రముఖులను గౌరవిస్తూ వైఎస్సార్‌ అవార్డులతో సత్కరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి. ఈ సంవత్సరం 27 మందికి వైఎస్సార్‌ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్, 23 మందికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేస్తున్నాం. 

తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్‌ వైఎస్సార్‌ పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తుంది. వైఎస్సార్‌ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా చరిత్ర మారుస్తూ ఎన్నో ముందడుగులు పడ్డాయి. ఇలాంటి రంగాల్లోవిశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది. ఈ అవార్డులు అందుకుంటున్నవారంతా తమ రంగాల్లో వారి జీవితాన్ని త్యాగం చేసినవాళ్లే. వారసత్వాన్ని తమ భుజాలపై మోసిన వారే. వీరంతా మన జాతి సంపద. సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత  అవార్డుల్లో ఈ మూడేళ్లు కూడా సామాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది అని అభిప్రాయపడ్డారు. 

గవర్నర్‌, సీఎం జగన్‌ చేతుల మీదుగా ఏడు రంగాలకు 27 మంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 23 మంది వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్నారు. నలుగురు వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్నారు. 

అవార్డులు అందుకున్న ప్రముఖులు 

వ్యవసాయంలో పంగి వినీత వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. అదే రంగంలో అనంతపురానికి చెందిన వైవి మల్లారెడ్డి పురస్కారం అందుకున్నారు. ఆర్ట్‌ అండ్ కల్చర్‌ రంగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంగస్థల నడుటు యడ్ల గోపాలరావుకు, తప్పెటగుళ్లు కళాకారుడు కోన సన్యాసి, తిరుపతికి చెందిన కంలకారీ ఆర్టిస్టు తలిసెట్టి మోహన్‌, బాపట్లకు చెందిన హరికథా కళాకారుడు కోట సచ్చిదానంద శాస్త్రికి అవార్డు వరించింది. ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీకి పురస్కారం దక్కింది. 
పురస్కారాలు అందుకున్న ఇతరులు

ఎస్‌వి రామారావు(కృష్ణా జిల్లా)- చిత్రకారుడు
బాల సరస్వతి (నెల్లూరు జిల్లా) ప్లేబ్యాక్ సింగర్ 
శివాజీ(ప్రకాశం జిల్లా ) జర్నలిస్టు, ఆర్టిస్టు 
చింగిచెర్ల కృష్ణారెడ్డి(అనంతపురం జిల్లా) జానపద కళలు
కలీసాహెబీ మహబూబ్‌, షేక్‌ మహబూబ్‌ సుబానీ( ప్రకాశం జిల్లా )నాదస్వరం
ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం(పశ్చిమ గోదావరి)- సాహిత్యం
ఖదీర్‌ బాబు(నెల్లూరు) - సాహిత్యం
మహెజబీన్‌(నెల్లూరు )- సాహిత్యం
నామిని సుబ్రహ్మణ్యం నాయుడు(చిత్తూరు)- సాహిత్యం
అట్టాడ అప్పలనాయుడు(శ్రీకాకుళం)- సాహిత్యం
పుల్లెల గోపీచంద్‌(గుంటూరు)- స్పోర్ట్స్‌
కరణం మల్లీశ్వరి(శ్రీకాకుళం)- స్పోర్ట్స్‌
ఇండ్ల రామ సుబ్బారెడ్డి (ఎన్టీఆర్‌ జిల్లా)- వైద్యం
ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి(వైయస్సార్‌ జిల్లా)- వైద్యం 
గోవిందరాజు చక్రధర్‌(కృష్ణా)- జర్నలిజం
హెచ్‌ ఆర్కే (కర్నూలు)- జర్నలిజం
బెజవాడ విల్సన్‌(ఎన్టీఆర్‌)- సోషల్ సర్వీస్
శ్యాం మోహన్‌(అంబేద్కర్‌ కోనసీమ)- సోషల్ సర్వీస్
నిర్మల హృదయ్‌ భవన్‌(ఎన్టీఆర్‌)- సోషల్ సర్వీస్
జి. సమరం(ఎన్టీఆర్‌ )- సోషల్ సర్వీస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Social Media Fire: మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
మూడో టెస్టులో సంబరాలెందుకు ?  గంభీర్ హయాంలో పతనవస్థకు టీమిండియా! ఫ్యాన్స్ ఫైర్
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Embed widget