అన్వేషించండి

Telangana Elections : ఎన్నికల్లో విజయం కోసం రాజశ్యామల యాగం - సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రారంభం !

కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంలో రాజశ్యామల యాగం చేస్తున్నారు. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద నేతృత్వలో యాగం జరుగుతోంది.


Telangana Elections :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  ఈ సారి  కూడా మూడు రోజుల పాటు ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో యాగం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగం జరుగుతోంది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు రుత్విక్కులు పాల్గొంటున్నారు.  మంగళవారం సాయంత్రం 200 మంది వైదికులు ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. 

మొదటి రోజు సంకల్పంతో శ్రీకారం                                             

బుదవారం మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో శ్రీకారం చుట్టారు.  రెండో రోజు వేదపఠనం, హోమం తదితర పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు పూర్ణాహుతి ఉంటుంది. తొలి రోజు హోమం ప్రారంభోత్సవంలో కేసీఆర్ దంపతులు కూడా పాల్గొన్నారు. కేసీఆర్ యాగాలు తరచూ నిర్వహిస్తూ ఉంటారు.  తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలని 2015లో చండీ యాగం నిర్వహించారు. అనంతరం.. 2018 ఎన్నికల రెండో విడతకు వెళ్లకముందే సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి రాష్ట్రంలో అధికారం సాధించారు. 

ప్రతి ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం               

ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో గులాబీ బాస్.. యజ్ఞం చేస్తున్నారు.  పూర్వ కాలంలో రాజు యుద్ధానికి వెళ్లే ముందు అర్చకులతో కలిసి రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారని పురోహితులు చెబుతున్నారు. శక్తి పొందడానికి, శత్రువుల బలాన్ని తగ్గించడానికి.. ప్రజలను మంత్రముగ్ధులను చేయడానికి ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పండితులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు రాజ శ్యామలా యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం అనంతరం సహస్ర చండీ యాగం నిర్వహించారు.             

ఇప్పటికే  తన స్వగృహంలో యాగం పూర్తి చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి                                     

బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఢిల్లీలో యాగం జరిగింది. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ దానికి ప్రతిఫలం దక్కుతుందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రడ్డి కూడా ముందుగానే  రాజశ్యామల యాగం చేశారు. కొడంగల్ లోని ఆయన నివాసంలో ఈ యాగం జరిగింది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
Hyderabad Crime News: ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
418 Movie OTT : ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Toilet Paper Health Risks : టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
TDP Leader Car Fire: చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
Embed widget