News
News
X

TTD Latest News: తిరుమలలో పెరుగుతున్న భక్తుల‌ రద్దీ, దర్శన సమయం, హుండీ ఆదాయం వివరాలివీ

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును అర్చకులు తెరిచారు.

FOLLOW US: 
 

Tirumala Tirupati Devasthanam Latest News: తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం 11-11-22 రోజున 61,304 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 30,133 మంది తలనీలాలు సమర్పించగా, 3.46 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయింది. దీంతో స్వామి వారి సర్వ దర్శనంకు 25 గంటల సమయం‌ పడుతుంది. ‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు నాలుగు గంటల సమయం పడుతుంది.  

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి (Sri Venkateshwara Swamy) కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ అటుతరువాత  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.

ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.  

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.

News Reels

సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 11 Nov 2022 08:26 AM (IST) Tags: TTD News piligrims rush in Tirumala Tirumala Hundi Income Tirumala Latest News

సంబంధిత కథనాలు

Nadendla Manohar : ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే వైసీపీ కుట్ర, ఇది ముమ్మాటికీ వికృత రాజకీయం- నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే వైసీపీ కుట్ర, ఇది ముమ్మాటికీ వికృత రాజకీయం- నాదెండ్ల మనోహర్

పుంగనూరులో పారిశ్రామికవేత్త ఇంటిపై అర్థరాత్రి దాడి - తాగుబోతులంటున్న పోలీసులు

పుంగనూరులో పారిశ్రామికవేత్త ఇంటిపై అర్థరాత్రి దాడి - తాగుబోతులంటున్న పోలీసులు

Draupadi Murmu Tirumala Visit: తిరుమలేశుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Draupadi Murmu Tirumala Visit: తిరుమలేశుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

AP News Developments Today: నేడు కీలక నేతలంతా ఢిల్లీ కి వెళ్లనున్నారు- ఏపీలో ఇవాల్టీ కీలక అప్‌డేట్స్‌ ఇవే!

AP News Developments Today: నేడు కీలక నేతలంతా ఢిల్లీ కి వెళ్లనున్నారు- ఏపీలో ఇవాల్టీ కీలక అప్‌డేట్స్‌ ఇవే!

శ్రీనివాసుడి సర్వదర్శనానికి 24 గంటల సమయం- తిరుమలేశుడిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము

శ్రీనివాసుడి సర్వదర్శనానికి 24 గంటల సమయం- తిరుమలేశుడిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!