Tirupati News: తిరుపతిలో సామూహిక వినాయక నిమజ్జనోత్సవం- తిరుమల భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు
Tirupati News: ఉమ్మడి చిత్తూర్ జిల్లా లో సోమవారం వినాయక సామూహిక నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి ఐయాయి. తిరుపతి జిల్లా, చిత్తూర్ జిల్లా లో అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పరిశీలిన చేసారు.
Ganesh Immersion : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వినాయక నిమజ్జనం సోమవారం జరుగనుంది. తిరుపతి, చిత్తూరు సహా చాలా ప్రాంతాల్లో మూడో రోజు వినాయక నిమజ్జనం చేయనున్నారు.
తిరుపతిలోని కరకంబాడీ మార్గంలో వినాయక నిమజ్జనం వినాయక సాగర్‌లో జరుగనుంది. తిరుపతిలోని సుమారు 800 విగ్రహాలపైగా ఉండగా 500 విగ్రహాల వరకు మూడో రోజు అయిన సోమవారం నిమజ్జనం చేయనున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ, తుడా, టీటీడీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఎస్పీ సుబ్బరాయుడు వినాయక సాగర్ ను పరిశీలించారు. అక్కడ చేసిన ఏర్పాట్లు చూసారు.
తిరుపతి నిమజ్జనం రూట్ మ్యాప్
వినాయక విగ్రహాలు వినాయక సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు తిరుపతి నగరములో రూట్ మ్యాప్‌లను పోలీసులు విడుదల చేశారు.
1) కోనేటికట్ట, నెహ్రూ వీధి, రైల్వే స్టేషన్, తుడా రోడ్డు మీదుగా కొర్లగుంట చేరి లీలామహల్ మీదుగా వినాయక సాగర్.
2) బాలాజీ కాలనీ, పోలీస్ క్వార్టర్స్, ఇందిరానగర్, టౌన్ క్లబ్, గాంధీ రోడ్డు, నాలుగు కాళ్ల మండపం, మున్సిపల్ ఆఫీస్, దేవేంద్ర థియేటర్ లీలామహల్ మీదుగా వినాయక సాగర్.
3) ఎల్.ఐ.సి ఆఫీస్ మార్గము నుండి జ్యోతి టాకీస్, రిజర్వాయర్ రోడ్డు, ఆర్కే డీలక్స్, భవాని నగర్, రెడ్డి రెడ్డి కాలనీ, మున్సిపల్ ఆఫీస్, దేవేంద్ర థియేటర్, లీలామహల్ మీదుగా వినాయక సాగర్.
4) ఇస్కాన్ టెంపుల్ నుండి అన్నారావు సర్కిల్, మున్సిపల్ పార్క్, లీలామహల్ మీదుగా వినాయక సాగర్
5) పద్మావతి నగర్, గాయత్రీ నగర్, మునిరెడ్డి కాలనీ, బైరాగి పట్టెడ, లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, శ్రీనివాసం, లీలామహల్ మీదుగా వినాయక సాగరకు పోవుటకు నిర్దేశించడమైనది.
పోలీసులు సూచించిన మార్గంలో ఆర్గనైజర్లు శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుపతి నగరమునకు వచ్చే భక్తులకు మరియు నగర ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. ఇక జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఘట్టి భద్రత చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లా వి కోట పై ప్రత్యేక దృష్టి
చిత్తూరు జిల్లాలో మూడో రోజు నిమజ్జనం కోసం పోలీసులు, ఆయా ప్రాంతాల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వి.కోట లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రత్యేక దృష్టి సారించారు.
వి.కోట లో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా నిమజ్జనాలలో చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు.
Also Read: మాజీ మంత్రి రోజా వర్సెస్ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, ట్వీట్ల వార్