(Source: ECI/ABP News/ABP Majha)
Nagari News: మాజీ మంత్రి రోజా వర్సెస్ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, ట్వీట్ల వార్
Nagari News: నగరి మాజీ mla రోజా ఎలక్షన్ ఫలితాల తరువాత తొలి సారి బయటకు వచ్చారు. ఆమె మాట్లాడిన మాటల పై జనసేన నాయకులు కౌంటర్ ఇస్తున్నారు కానీ ఉమ్మడి చిత్తూర్ జిల్లా లో మాత్రం ఎవరు స్పందిచడం లేదు
Nagari News: ఆమె మాటలు యుద్దం చేస్తాయి.. మైకు పెడితే ఏమి మాట్లాడుతుందని ఎదురుచూసే వాళ్లు.. మాట్లాడాక ఏ కౌంటర్ ఇవ్వాలని ఆలోచించే వారు. అలాంటి ఆమె ఓటమి తరువాత మరోసారి బయటకు వచ్చింది.. ఆమె మాటల యుద్ధం ప్రారంభమైంది.. మరీ కౌంటర్లు వచ్చాయా.. అసలు ఎవరు ఆమె అని అంటున్నారా అయితే ఆమె మరెవరో కాదు మాజీ మంత్రి ఆర్కే రోజా.
నటిగా... నాయకురాలుగా,ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు ఆర్ కె రోజా. గత 10 సంవత్సరాల కాలంలో నగరి ఎమ్మెల్యే రోజా కంటే ఫైర్ బ్రాండ్ రోజాగా రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అనేక సంవత్సరాల తరువాత ఎమ్మెల్యే గా గెలిచి ఆనందాన్ని కన్నీటి తో ప్రారంభించి మీడియాలో నిలిచిన రోజా 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా కాకుండా అధికార పక్షంపై తనదైన శైలిలో మాటల యుద్దం చేశారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తో పాటు ఎమ్మెల్యే గా రోజా కూడా గెలిపించారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు
అధికారంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు నాయకులు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిగత జీవితం పై మాట్లాడేది. దీంతో జనసేన నాయకులకు రోజా కు మాటలు తూటాలుగా పేలేవి. ఇక 2019 నుంచి 2012 వరకు ఎమ్మెల్యే గా ఉండగా.. అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి నియోజకవర్గం లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఇక ఆమె మాటల కారణంగానే 2024 ఎన్నికల్లో నగరిలో ఓటమిపాలైందని రాజకీయ విశ్లేషకులు అన్నారు.
ఎక్స్ లో కౌంటర్
మాజీ మంత్రి రోజా ఎన్నికల ఓటమి తరువాత పూర్తి గా నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు. కనీసం సోషల్ మీడియా లో సైతం ఎలాంటి పోస్టులు లేకుండా పోవడంతో ఆమెపై అనేక కథనాలు ప్రచారంలో కి వచ్చాయి. ఏపీ ప్రజలు ఇచ్చిన దెబ్బకి ఏపీ రాజకీయాలు వదిలి తమిళనాడు రాజకీయాల వైపు వెళ్లిపోయిందన్నారు. తమిళం బుల్లి తెర వైపు ఆమె దృష్టి సారించిందని.. జబర్థస్త్ తరహా తమిళ టీవీ షో లకు వెళ్తున్నారంటూ చెప్పారు.. మరికొందరు అయితే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేశారని.. అందుకు ఆమె సోషల్ మీడియా లో కూడా జగన్, వైసీపీ లోగోలు, డీపీ మార్చిందనుకున్నారు. దీనిపై ఎలాంటి ప్రకటన కాని పోస్టులు కాని రోజా లేదా ఆమె వర్గీయులు చేయలేదు.
ఇక తాజా గా ఏపీ వరదల పై రోజా ఓ వీడియో విడుదల చేశారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, 108, 104 వాహనాలు, క్లీన్ ఆంధ్రా వాహనాలు, వైఎస్సార్ హెల్త్ సెంటర్లు ఉండి ఉంటే నేడు సహాయక చర్యలు, ఇతర కష్టాల నుంచి విజయవాడ ప్రజలకు మరింత మెరుగైన చేయవచ్చని అన్నారు. ఇక జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్ లేకుంటే మరింత ఎక్కువ వరద ప్రభావం చూపుతుందని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ విజయవాడకు రాలేదని ప్రశ్నించారు. దీనిపై కౌంటర్ ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ సైతం అదే రోజు ప్రెస్ మీట్ నిర్వహించి నేను వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే పోలేదు అంటూ చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి స్పందించిన రోజాకు కూటమి ప్రభుత్వం నుంచి కౌంటర్లు ప్రారంభమైంది. ఆనాడు వరదలు వస్తే జగన్ వస్తే సహాయక చర్యలు ఇబ్బంది అని మాట్లాడిన వారు నేడు పవన్ రాలేదని చెప్పడం... సహాయ చర్యలు చేయకపోగా అక్కడ చేసే వారిని విమర్శించడం... విరాళాలు ఇవ్వలేని మీరు కూడా రూ.6 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నారు.
Also Read: భారీ వర్షాల ఎఫెక్ట్, సోమవారం ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
జిల్లాలో మాట్లాడేవారు లేరు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం లో ఎవరికి మంత్రి పదవులు లేవు. గత వైసీపీ ప్రభుత్వం లో ప్రతిపక్ష నాయకులపై విమర్శలు కురిపించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా వైసీపీ నాయకుల చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రధానంగా వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని అంటున్నారు. నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేసిన విమర్శల పై మీడియా ప్రశ్నిస్తే సైతం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడలేని పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం పై వైసీపీ తిరిగి మాటలు యుద్దానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక తాజాగా రోజూ x వేదికగా పెట్టిన పోస్టుకు నగరి ఎమ్మెల్యే భాను కౌంటర్ ఇచ్చారు.
Also Read: Chandrababu: ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముంది, అలర్ట్ గా ఉండాలి - చంద్రబాబు కీలక సూచనలు