అన్వేషించండి

Chandrababu: ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముంది, అలర్ట్ గా ఉండాలి - చంద్రబాబు కీలక సూచనలు

AP Rains: విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఫ్లాష్ ఫుడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

Rains in Andhra Pradesh | ఏపీలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఈసారి ఉత్తరాంధ్రపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. ముందుగానే ఆయా జిల్లాల అధికారుల్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఇటు విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.

ఉత్తరాంధ్రలో వరదలకు అవకాశం

ఈసారి వర్షాలు, వరదల ప్రభావం ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉండే అవకాశముందని చెప్పారు సీఎం చంద్రబాబు. అల్లూరి జిల్లాకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, దానికి అనుగుణంగా ఆ జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని ఆయన చెప్పారు. అటు విశాఖలో కొండ చరియలు విరిగి పడుతుండటంతో అక్కడ కూడా అధికారుల్ని అప్రమత్తం చేశామని, కొండ వాలు ప్రాంతంలోని ఇళ్లను ఖాళీ చేయించామని చెప్పారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజల్ని అప్రమత్తం చేశామన్నారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాలకు నష్టం వాటిల్లకుండా అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వరకు ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ముఖ్యంగా అల్లూరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేందుకు ఛాన్స్ లు ఉన్నాయని అన్నారు. 

గవర్నర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఆదివారం ఉదయం రాష్ట్ర గవర్నర్ ని కలిసి, వరద సహాయక చర్యల గురించి వివరించామని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్న సహాయక కార్యక్రమాల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో 97 లక్షల మందికి భోజనం అందించామని చెప్పారు చంద్రబాబు. 94 లక్షల వాటర్ బాటిల్స్ ని వారికి చేర్చామన్నారు. 28 లక్షల లీటర్ల పాలు, 41 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లు బాధితులకు ఇచ్చి వారి ఆకలి తీర్చామన్నారు. 1.10 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశామన్నారు. 3 లక్షల క్యాండిల్స్, 1.9 లక్షల అగ్గిపెట్టెలు సరఫరా చేశామన్నారు. మొత్తంగా 163 మెట్రిక్ టన్నుల కూరగాయలను వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించామని, 2090 సార్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేశామన్నారు. ఇక బురదతో ఇబ్బందిపడుతున్నవారికి కూడా ప్రభుత్వం సాంత్వన చేకూర్చిందన్నారు సీఎం. ఫైర్ ఇంజిన్ల ద్వారా 27 వేల ఇళ్లు శుభ్రం చేయించామన్నారు. 

వరదలు మొదలై ఎనిమిది రోజులు గడుస్తున్నా కూడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 0.51 టీఎంసీ నీళ్లు ఉన్నాయని, వాటన్నిటినీ బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రోడ్లపై బురద పేరుకుపోకుండా చేస్తున్నామని, ఇసుక, మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. వర్షాలు, వరదల కారణంగా బైక్ లు, ఆటోలు, కార్లు పాడైపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీవీలు, ఫ్రిజ్ లు, మిక్సీలు.. ఇలాంటి గృహోపకరణాలు కూడా పాడైపోయాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

Also Read: ఎవరికి తోస్తే వాడు ఓ ట్యూబ్ పెట్టుకుంటాడు - యూట్యూబ్ ఛానెళ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కృష్ణానదికి వరద వచ్చిందని, వాతావరణంలో పెను మార్పులు దీనికి కారణం అని అధికారులు, నిపుణులు చెబుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. బుడమేరు కబ్జాల వల్ల వరదనీరు లోతట్టు ప్రాంతాలకు చేరిందని, లక్షలమంది ఇబ్బంది పడ్డారని అన్నారాయన. భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు లేకుడా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు

Also Read: ఒవైసి కాలేజీ ఎప్పుడు కూల్చుతారు? రేవంత్ రెడ్డి భయపడ్డారా ! లేక రాజీపడ్డారా?: రాజాసింగ్ సంచలనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget