Tirupati Devasthanam: తిరుమలలో వాడిన పూలు మీ ఇంట్లో వికసిస్తాయి.. సువాసనలు పంచుతాయి..
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి పూజలకు వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారీ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఈనెల 13 నుంచి విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు.
తిరుమలేశుడి సేవకు ఉపయోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై టీటీడీ ఆలోచన చేసింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్ నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న టీటీడీ తిరుపతి శ్రీవేంకటేశ్వర గోశాల ఆవరణలో అగరబత్తీల ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే తయారీ ప్రక్రియ తుదిదశకు చేరుకోవడంతో సెప్టెంబరు 13 నుంచి వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రానికి తరలిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది రకాల వారీగా పుష్పాలను వేరు చేసి వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ పిండిలో నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్స్ చేసి...ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తీలు తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు. చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తీలు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు.
Also read:ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి..
టీటీడీ ఆలయాల్లో పూజలు, అలంకరణలకు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. పర్వదినాలు, ఉత్సవాల సమయంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇలా ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. స్వామివారి సేవకు వినియోగించిన ఈ పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించేందుకే టీటీడీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఏడుకొండల గుర్తుగా అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి , సృష్టి ,తుష్టి , దృష్టి ఇలా ఏడు బ్రాండ్లలో అగరబత్తీలు తయారు చేశారు.ఇప్పటికే ప్రక్రియ తుదిదశకు చేరుకోవడంతో ఈనెల 13 నుంచి విక్రయించనున్నారు. అంటే ఇకపై ప్రతి ఇంట్లో శ్రీవారి పూల సువాసనలు అగరబత్తీల ధూపంలో పరిమళించనున్నాయి.
Also Read:నేటి నుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు.. ఆ జిల్లా వాసులకు మాత్రమే అని చెప్పిన టీటీడీ
Also Read:చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు పునఃప్రారంభం
Also Read: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...
Also Read:ఈ రాశులవారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయం