అన్వేషించండి

EAPCET Results 2021: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..  ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021  పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగానికి మాత్రమే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 14న అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. 1,66,462 మంది పరీక్షలు రాయగా.. 1,32,233 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. ఉత్తీర్ణతా శాతం 80.62గా ఉందని చెప్పారు. అభ్యర్థులు తమ ఫలితాలను ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఈఏపీసెట్ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ (JNTUK) నిర్వహిస్తోంది. 

ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,76,603 మంది అప్లై చేసుకోగా.. 1,66,460 మంది హాజరయ్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు.. గత నెల 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇవి ఈ నెల 3, 6, 7 తేదీల్లో జరిగాయి. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు మొత్తం 5 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 88,822 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా.. 78,066 మంది హాజరయ్యారు. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ నెల 18 నుంచి ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.. 
ఇంజనీరింగ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), ఫార్మా డీ, బీ-ఫార్మసీ, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ కోర్సులలో అడ్మిషన్లు పొందవచ్చు. 

ఇంట‌ర్ వెయిటేజీ తొల‌గింపు..
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల‌లో ప్రవేశాలకు ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కుల‌ను తొలగిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కోవిడ్ కార‌ణంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది. గ‌తేడాది వ‌ర‌కు ఈ ప్రవేశ ప‌రీక్ష‌ల‌లో విద్యార్థుల ఇంట‌ర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారమని.. ఈ ఏడాది దీనిని తొల‌గించిన‌ట్లు రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈఏపీసెట్ రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్ స్ప‌ష్టం చేశారు. 

Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..

Also Read: ANGRAU Admissions 2021: ఏపీ వ్యవసాయ పాలిటెక్సిక్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటివరకు అంటే?

టాప్ హెడ్ లైన్స్

National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget