అన్వేషించండి

CM Jagan Tirupati Tour: నేడు తిరుపతికి సీఎం జగన్, పూర్తి షెడ్యూల్ ఇదీ - కాన్వాయ్ రిహార్సల్ పూర్తి

CM Jagan విమానాశ్రయానికి చేరుకున్న తరువాత అక్కడ నుంచి ఒక ఆలయాన్ని ప్రారంభించడానికి హెలికాప్టర్లో ఆలయం సమీపానికి చేరుకుంటారు.

CM Jagan Tirupati Tour: భూమి పూజలు, పలు శంకుస్థాపనలు, వకుళా మాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనడానికి నేడు (జూన్ 23) రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న తరువాత అక్కడ నుంచి ఒక ఆలయాన్ని ప్రారంభించడానికి హెలికాప్టర్లో ఆలయం సమీపానికి చేరుకుంటారు. ఆలయం వద్ద హెలిప్యాడ్, ఆలయం పరిసరాలలో భద్రతా ఏర్పాట్లను అనంతపురం రేంజ్ డి.ఐ.జి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఎస్పీ సతీష్ బాబు కలిసి బుధవారమే పర్యవేక్షించారు. 

అదేవిధంగా శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరు వద్ద అపాచీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. అక్కడినుంచి బయలుదేరి రేణిగుంట సమీపంలోని టి.సి.యల్ (ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్) పరిసర ప్రాంతాలను కూడా పోలీసు భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ప్రాంతాలలో కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించి భద్రతను సమీక్షించారు. ప్రతి ప్రాంతంలో సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు ఇస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

సీఎం పర్యటనకు పోలీస్ అధికారులు సివిల్ విభాగం నుండి 1,050, ఏ.ఆర్ విభాగం నుండి 730 మంది మొత్తం 1,780 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఇ.సుప్రజ, L&O కులశేఖర్ గారు, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ఏఆర్ డీఎస్పీ నంద కిశోర్, సీఐలు, ఆర్ఐ లు, ఇంటలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు.

పూనం మాలకొండయ్య కుమార్తెకు సీఎం శుభాకాంక్షలు

వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం ఈ వేడుక జరిగింది. ఈ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించి వారికి శుభాకంక్షలు తెలియజేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Embed widget