PM Modi Modi On Chittoor Accident: చిత్తూరు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
PM Modi Modi On Chittoor Road Accident: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
PM Modi Modi On Chittoor Road Accident: ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫంక్షన్కు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందజేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఎంగేజ్మెంట్కు వెళ్తుంటే పెను విషాదం..
చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులోపెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా తిరుపతికి వెళ్తుండగా మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మొదట ఆరుగురు చనిపోగా, నారావారిపల్లె పీహెచ్సీకి తరలించగా చికిత్స పొదుతూ చిన్నారి చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య 8 కి పెరిగింది. తాజాగా మరో వ్యక్తి చనిపోయారు.
Pained by the loss of lives in a tragic bus accident in Chittoor, AP. Condolences to the bereaved families. I hope the injured recover soon.
— PMO India (@PMOIndia) March 27, 2022
The next of kin of the deceased would be given Rs. 2 lakh from PMNRF and Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
చనిపోయింది వీరే..
పెళ్లి కొడుకుతో పాటు 45 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు లోయలో పడ్డ ఈ ప్రమాదంలో డ్రైవర్ నబీ రసూల్, మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి గణేశ్ (40), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40), జె.యశస్విని(8), ట్రావెల్స్ క్లీనర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
Also Read: Tirupati Accident: ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, లోయలో పెళ్లి బస్సు బోల్తా - చిన్నారి సహా 8 మంది మృతి
Also Read: Chittoor Accident: బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన మంత్రి - ఒక్కొక్కరికి ఎంతంటే