అన్వేషించండి

Pawan Kalyan: అభిమాని మృతి, వారి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Rains | తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ కొట్టి ఓ అభిమాని చనిపోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

AP Deputy CM Pawan Kalyan | తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ఓ జన సైనికుడు చనిపోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం అనుపల్లెలో ఫ్లెక్సీ కడుతుండగా బి.గోపి, మధులకు కరెంట్ షాక్ కొట్టింది. విద్యుదాఘాతంతో గోపి అనే జన సైనికుడు మృతి చెందడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మధు అనే మరో జన సైనికుడు గాయపడ్డారు. ఇలాంటి దుర్ఘటన జరగటం దురదృష్టకరం అని, గోపి ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాయకష్టం చేసుకొనే గోపి చనిపోవడంతో అతడి కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో అర్ధం చేసుకోగలను అన్నారు. ఫ్లెక్సీ కడుతూ చనిపోయిన గోపి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అతడి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీమధుకి హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. జనసైనికులకు ఇలా జరిగిందన్న దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక జనసేన నాయకులు అక్కడికి వెళ్లారు. బాధిత కుటుంబాలకు పవన్ కళ్యాణ్, పార్టీ అండగా ఉంటాయని ఓదార్చారు. 

Also Read: Pawan Kalyan Birthday: కళ్యాణ్ బాబు... నీలాంటి నాయకుడు కావాలి, నువ్వు అద్భుతాలు చెయ్యగలవ్ - తమ్ముడికి మెగాస్టార్ బర్త్‌డే విషెస్ 

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జనసేన శ్రేణులు పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేనాని ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరద ప్రభావం లేని చోట్ల క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాలలో పాల్గొన్నారు. విస్తృతంగా మొక్కలు నాటి, సేవా కార్యక్రమాల్లో జనసేన నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

ఏపీలో భారీ వర్షాలు, వరద నీటితో పరిస్థితి అదుపుతప్పింది. కొన్నిచోట్ల ప్రాణనష్టం సైతం సంభవించింది. ఈ పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తన పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. జనసైనికులు విరివిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, వరద బాధితులకు సహాయం చేయాలని సూచించారు. కొన్నిచోట్ల కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును జనసైనికులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిగ్‌బీ కేబీసీ షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం, మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్Telangana High court on Hydra | తెలంగాణలో హాట్ టాపిక్ 'హైడ్రా' పై హైకోర్టు దృష్టి | ABP DesamSarpanch Unanimous Election | సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్థులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Renu Desai: దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
Vijayawada floods: వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Crime News: తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
YSRCP : వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
Embed widget