(Source: ECI/ABP News/ABP Majha)
అధిక ఫీజులు వసూలు చేస్తే 1902 కాల్ చేయండి- తల్లిదండ్రులకు సీఎం జగన్ సూచన
విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు సమస్య కాకూడదన్న కారణంతో విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి 3నెలలకోసారి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్.
పిల్లల చదువులు కారణంగా తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదనే విద్యాదీవెన లాంటి కార్యక్రమం తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా నగరిలో విద్యాదీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ చేయని విధంగా తమ హయాంలో పిల్లల చదువుపై ఫోకస్ పెట్టామన్నారు జగన్.
విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు సమస్య కాకూడదన్న కారణంతో విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి 3నెలలకోసారి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. పిల్లల తల్లుల ఖాతాల్లో నేరుగా ఈ డబ్బులు పడుతున్నాయని తెలిపారు. నేరుగా వాళ్లే వెళ్లి కళాశాలల ఫీజులు చెల్లించి తమ పిల్లల చదువులపై ఆరా తీయాలన్నారు. విద్యార్థుల చదువులు సరిగా లేకపోయినా, బోధన బాగోలేకపోయినా, వసతులు సరిపడా లేకపోయినా యాజమాన్యాన్ని నిలదీయాలని సూచించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే 1902కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పథకాలు రూపొందిస్తుందన్నారు జగన్. అలాంటి పథకాల్లో విద్యాదీవెన ఒకటి అని ఇది విద్యార్థుల భవిష్యత్‌ను మార్చే పథకమని అభిప్రాయపడ్డారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 11 వేల 3వందల కోట్ల రూపాయలు అందించామన్నారు. 8 లక్షల 44 వేల 336 మంది లబ్ధిపొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.680 కోట్లు జమ చేసినట్టు చెప్పుకొచ్చారు.
నగరి సభలో చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారని ఫైర్ అయ్యారు. మూడు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదన్నారు. ఆయనకు సొంతకుమారుడిపై నమ్మకం లేదని అందుకే దత్తపుత్రుడిని అద్దెకు తెచ్చుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేస్తానని ఢిల్లీ వెళ్లారని... ఆయనే దొంగ ఓట్లు సృష్టించి ఆయనే ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు జగన్. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్దాలు, మోసాలు, కుతంత్రలేనన్నారు. అంగళ్లులో కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవల సృష్టించి లబ్ధి పొందాలని చూశారన్నారు. పోలీసులపై దాడులు చేయించాలని ఓ పోలీసు కన్ను కూడా పోయిందన్నవారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటోకే దండ వేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు నాణెం విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని ఎద్దేవా చేశారు.