Mother Left Her Baby in BUS Stand For Insta Lover | ప్రియుడి కోసం బస్టాండ్‌లో బిడ్డను వదిలేసిన తల్లి | ABP Desam
ఇన్ స్టా గ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం పసి పిల్లాడిని బస్టాండ్ లో వదిలేసిన ఓ తల్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నల్లగొండ బస్టాండ్‌లో జరిగింది ఈ దారుణం. ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన తన ప్రియుడి కోసం వెళ్లిపోవాలని డిసైడ్ అయిన ఆ తల్లి తన కన్న బిడ్డను ఇలా బస్టాండ్ కి తీసుకువచ్చి వదిలేసి తనకేం పట్టన్నట్లుగా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ పసిపిల్లాడి ఏడుపులు విన్న ఓ యువకుడు బస్టాండ్ సిబ్బందికి ఆ పిల్లాడిని అప్పగించగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించిన అధికారులకు ఈ దారుణం కళ్లబడింది. సీసీటీవీ ఫుటేజ్ లో తన తల్లి కనిపించగానే ఆ పిల్లాడు మమ్మీ అంటూ ఏడవటం అధికారులను అందరినీ కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రియుడి బండి నెంబర్ ఆధారంగా తల్లిని, ఆమె భర్తను, ప్రియుడిని ముగ్గురుని స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లాడిని కన్నతండ్రికి అప్పగించారు.





















