Eng vs Ind Test Series Gill Jadeja Records | క్రికెట్ లెజెండ్స్ సరసన నిలిచిన గిల్, జడేజా | ABP Desam
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపుతున్న యంగ్ టీమిండియా దశాబ్దాల నాటి రికార్డులను బద్ధలు కొడుతోంది. ప్రత్యేకించి బ్యాటింగ్ లో మనోళ్లు దుమ్ము రేపుతున్నారు. కెప్టెన్ గిల్, రాహుల్, పంత్, జడేజా ఇప్పటికే సిరీస్ లో టాప్ 4 బ్యాటర్లుగా కొనసాగుతూ నలుగురూ 400లకు పైగా పరుగులతో ఇంగ్లండ్ గడ్డపై తమ సత్తా చాటారు. ఇలా ఓ టెస్ట్ సిరీస్ లో భారత బ్యాటర్లు నలుగురు 400లకు పైగా పరుగులు నమోదు చేయటం ఇదే తొలిసారి. అయితే ఈ క్రమంలో గిల్, జడేజాలు మాత్రం దిగ్గజాల సరసన చేరారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు నాయకుడిగా ఇదే తొలి టెస్ట్ సిరీస్. అలాంటిది ఫస్ట్ అసైన్మెంటే ఇంగ్లండ్ లో వచ్చినా చెక్కు చెదరకుండా ఆడుతున్న గిల్ నిన్న మాంచెస్టర్ లో సెంచరీతో ఈ సిరీస్ లో నాలుగో శతకాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఫలితంగా కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే నాలుగు సెంచరీలు చేసిన డాన్ బ్రాడ్ మన్, సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు గిల్. అదీ కాకుండా బ్రాడ్ మన్ మాత్రమే ఇంగ్లండ్ లో ఒకే సిరీస్ లో నాలుగు సెంచరీలు చేసింది. అది కూడా 1930లో అంటే మళ్లీ 95 సంవత్సరాల తర్వాత గిల్ ఆ రికార్డును సమం చేసి బ్రాడ్ మన్ తో పాటు గా నిలిచాడు. మరొక్క సెంచరీ సాధిస్తే గిల్..బ్రాడ్ మన్ వందేళ్ల రికార్డులను తుడిచి పెట్టేసే అవకాశం ఉంటుంది. మరో వైపు వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అయితే ది గ్రేట్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ సరసన నిలిచాడు. నిన్న మాంచెస్టర్ లో కొట్టిన సెంచరీతో జడ్డూ సోబర్స్ తో సమానంగా నిలిచే అరుదైన ఘనతను సాధించాడు. అదేంటంటే ఆరు అంత కంటే తక్కువ స్థానంలో వచ్చి ఇంగ్లండ్ లో 9 హాఫ్ సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్ ఇప్పటి వరకూ సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ మాత్రమే అలాంటిది నిన్న మాంచెస్టర్ ఇన్నింగ్స్ తో జడ్డూ సోబర్స్ తో సమానంగా 9 హాఫ్ సెంచరీలు కొట్టిన విదేశీ బ్యాటర్ గా నిలిచాడు. పైగా ఇంగ్లండ్ లో వెయ్యికి పరుగులు చేసిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అండ్ రవీంద్ర జడేజా మాత్రమే. అలా గిల్, జడ్డూ ఇద్దరూ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లతో సమానంగా రికార్డులను అందుకున్నారు.





















