Baladitya New Serial: బిగ్‌బాస్ బాలాదిత్య కొత్త సీరియల్ టైటిల్ ఇదే - 'వంటలక్క'కు జోడీగా!
Srihari Kalyanam Serial: 'బిగ్‌బాస్' ఫేమ్ బాలాదిత్య నాలుగేళ్ల తర్వాత సీరియల్స్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. 'శ్రీహరి కళ్యాణం' పేరుతో కొత్త సీరియల్ చేస్తున్నాడు. అందులో అతనికి జోడీ ఎవరంటే?

Baladitya Re Entry Into Serials: దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు సీరియల్స్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు 'బిగ్ బాస్' ఫేమ్ బాలాదిత్య. ఓ కొత్త సీరియల్‌కు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సీరియల్ టైటిల్ ఏంటి? ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుంది? వంటి వివరాలు వెల్లడి అయ్యాయి.
'శ్రీహరి కళ్యాణం' సీరియల్‌లో హీరోగా బాలాదిత్య
Baladitya new serial titled Srihari Kalyanam: బాలాదిత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ 'శ్రీహరి కళ్యాణం'. అతి త్వరలో ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో బాలాదిత్యకు జోడీగా శిరిన్ శ్రీ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. 'స్టార్ మా'లో టెలికాస్ట్ అయిన 'వంటలక్క' సీరియల్‌తో ఫేమస్ అయ్యింది శిరిన్ శ్రీ. ఈ సీరియల్‌లో వరమ్మ పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టింది.
అతి త్వరలో జెమిని టీవీలో టెలికాస్ట్‌కు రెడీ!
Shirin Sri role in Srihari Kalyanam Serial: 'వంటలక్క'లో ట్రెడిషనల్ రోల్‌లో కనిపించిన శిరిన్... 'శ్రీహరి కళ్యాణం'లో మాత్రం రొమాంటిక్ టచ్‌తో సాగే ఫన్నీ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. 'శ్రీహరి కళ్యాణం' సీరియల్ జెమిని టీవీలో టెలికాస్ట్ కాబోతుంది. ఆగస్ట్ నెలలో ఈ సీరియల్‌ను లాంఛ్ చేసేందుకు జెమిని టీవీ సన్నాహాలు చేస్తోంది. ప్రోమోతో త్వరలోనే శ్రీహరి కళ్యాణం రిలీజ్ డేట్‌ను రివీల్ చేయబోతున్నట్లు సమాచారం.
బాలాదిత్య సీరియల్ నిర్మాత చంటిగాడు హీరోయినే!
'శ్రీహరి కళ్యాణం' సీరియల్‌ను టీవీ యాక్టర్ సుహాసిని నిర్మించబోతున్నది. కొన్ని ఏళ్ళ క్రితం వాళ్లిద్దరూ జంటగా సినిమా చేశారు. 'చంటిగాడు'తోనే బాలాదిత్య, సుహాసిని హీరో హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. విలేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఆ మూవీ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. 'చంటిగాడు' తర్వాత ఇద్దరికీ సినిమాల్లో అవకాశాలు బాగా వచ్చినా సక్సెస్‌లు మాత్రం అందుకోలేకపోయారు. దాంతో బాలాదిత్య, సుహాసిని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు.
Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!
సావిత్రమ్మ గారి అబ్బాయి... తొమ్మిది వారాల తర్వాత!
డెబ్యూ మూవీ హీరో బాలాదిత్య సీరియల్‌కు సుహాసిని నిర్మాతగా వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. 'శ్రీహరి కళ్యాణం'లో సుహాసిని గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చివరగా తెలుగులో 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్ చేశాడు బాలాదిత్య. ఆ సీరియల్‌కు 2021లో శుభం కార్డు పడింది.
Also Read: జయం సీరియల్ టీఆర్పీ రేటింగ్... ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది? 'జీ తెలుగు'లో ఎన్నో ప్లేసులో ఉంది?
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు బాలాదిత్య. తొమ్మిది వారాల తర్వాత హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన వెండిపట్టీలు, ఉత్తరం అనే మినీ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మరో వైపు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సినిమాలతో పాటు సీరియళ్ళలోనూ బిజీ బిజీ అయ్యేట్టు ఉన్నాడు. అటు వెండితెర, ఇటు బుల్లితెర, అలాగే డిజిటల్ తెరపై సందడి చేయనున్నాడు.





















