Ben Stokes Appeal for Draw Jadeja Denied | సెంచరీలు కొట్టే టైమ్ కి ఇంగ్లండ్ కు డ్రా గుర్తొచ్చింది | ABP Desam
మాంచెస్టర్ టెస్టులో భారత్ చేసుకున్న డ్రా….విజయం కంటే ఎందుకు గొప్పది అంటే...మనోళ్లు ఇంగ్లండ్ ను మానసికంగా చంపేశారు. రీజన్ రెండు రోజుల బ్యాటింగ్. 669పరుగుల భారీ స్కోరు పెట్టాం కదా రెండు రోజుల టైమ్ ఉంది ఇండియా ఆలౌట్ అవటం డెడ్డు ఈజీ అనుకున్న బెన్ స్టోక్స్ బ్యాచ్ భారత బ్యాటర్లు బ్రెడ్ హల్వా తినిపించారు. ముందు గిల్, రాహుల్ ఎడతెగని పోరాటం చేస్తే...తర్వాత జడ్డూ, వాషింగ్టన్ సుందర్ ఆడారండీ. టెస్ట్ మ్యాచ్ జిడ్డును రుచి చూపిస్తూ 60కి పైగా ఓవర్లు కరిగించేసి ఇంగ్లండ్ తో 138ఓవర్లు బౌలింగ్ చేయించి వాళ్లను శారీరకంగా పూర్తి గా అలసిపోయేలా చేశారు. సరిగ్గా 138 ఓవర్లు ముగిసే సమయానికి జడ్డూ 89 పరుగులు మీద సుందర్ 80 పరుగుల దగ్గర ఉన్నారు. ఆ టైమ్ లో మేండేటరీ ఓవర్ల కోటా పూర్తి అయిపోవటంతో ఏదో మేం గిప్ట్ ఇస్తున్నాం పోండి అన్నట్లు డ్రా చేసుకుందాం అని వచ్చి ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ జడేజాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ జడ్డూ డ్రా కి ఒప్పుకోలేదు. రెండు పాయింట్లు ఒకటి మేం కష్ట పడి ఆడాం...సెంచరీల ముందున్నాం సెంచరీకి మేం అర్హులం అనేది ఒకటి..రెండోది డ్రా తీసుకోవాలా వద్దా అనేది మా కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఇష్టం నేను చేసేది ఏం లేదు అన్నాడు. అంతే హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్ అందరూ స్టోక్స్ తో మద్దతుగా వచ్చేసి అలా ఎలా ఆడుతారు...మీరేం గెలవరుగా డ్రా చేసుకుందాం అని ఒకటే గోల. స్టోక్స్ అయితే ఇంకో అడుగు ముందుకేసి హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ తో బౌలింగ్ చేస్తుంటే సెంచరీ కొడతారా మీరు అని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. డ్రా చేసుకుందాం అని అడుక్కున్నారు. జడేజాకి మండుకొచ్చి ఫాస్ట్ బౌలర్లే వేయండి ఎవడొద్దన్నాడు అన్నాడు లుక్స్ ఇచ్చాడు. ఇక చేసేదేం లేక రూట్ తో, హ్యారీ బ్రూక్ తో బౌలింగ్ వేయించాడు బెన్ స్టోక్స్. ఫీల్డింగ్ అంతా సర్కిల్ లో పెట్టించి మనోళ్లను షాట్స్ ఆడుకోమని చెప్పాడు. ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు..హ్యాపీగా షాట్స్ ఆడుకుని జడ్డూ కెరీర్ లో ఐదో సెంచరీ..సిరీస్ లో మొదటి సెంచరీ..ఇంగ్లండ్ లో రెండో టెస్ట్ సెంచరీ కొట్టి..వరల్డ్ నెంబర్ 1 ఆల్ రౌండర్ ని అని నిరూపించుకుంటే సుందర్ కెరీర్ లో ఫస్ట్ సెంచరీ కొట్టి పండగ చేసుకున్నాడు. మధ్యలో జడ్డూ సెంచరీ చేసినప్పుడు కూడా హ్యారీ బ్రూక్ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ట్రై చేశాడు. ఇదంతా ఏంటంటే కుళ్లు..అక్కసు. ఎలాగో రెండు రోజుల కష్టపడినా ఇండియాను ఓడించలేకపోయాం...వాళ్లతో సెంచరీలు కొట్టించుకుని సొంత గ్రౌండ్స్ లో రికార్డులు ఇచ్చుకోవటం దేనికి అనే మైండ్ సెట్. ఫాస్ట్ బౌలర్లు వేయటానికి నొప్పి ఏంటి ఇంగ్లండ్ 669 పరుగులు చేసినప్పుడు మనోళ్లు 157ఓవర్లు బౌలింగ్ చేయలేదా అని టీమిండియా ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్. మొత్తంగా మాది బాజ్ బౌల్ అటాకింగ్ గేమ్ తో కుళ్లబొడుస్తాం అని డైలాగులేసిన ఇంగ్లండ్ బాబులు బెగ్ బాల్ లా డ్రా కోసం ఇలా అడుక్కోవటం మాత్రం చీప్ వెరీ చీప్.





















