That is Trump: మరో యుద్ధాన్ని ఆపిన ట్రంప్ - నోబెల్ బహుమతి ఇచ్చేస్తారా ?
Thailand Cambodia: థాయిల్యాండ్, కాంబోడియా మద్య యుద్ధం ఆగింది. కాల్పుల విరమణ ప్రకటించాయి. తన ఘనతేనని ట్రంప్ ముందే ప్రకటించారు.

Trump stopped another war: థాయ్‌లాండ్ , కాంబోడియా కాల్పుల విరమణ ప్రకటించాయి. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ఫుమ్‌థం వెచాయచై , కాంబోడియా ప్రధానమంత్రి హన్ మనేట్ "తక్షణ, షరతులు లేని" కాల్పుల విరమణ పాటిస్తున్నట్లుగా ప్రకటించారు. కాల్పుల విరమణ వెంటనే అమల్లోకి వచ్చిందన్నారు.
మలేషియా, ఆసియాన్ చైర్‌గా, జులై 27, 2025న పుత్రజయలో చర్చలను నిర్వహించింది. ఈ చర్చలకు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం నేతృత్వం వహించారు. అమెరికా, చైనా సహకారంతో ఈ చర్చలు జరిగాయి. ట్రంప్ జులై 26న రెండు దేశాల నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణకు పాటించాలన్నారు. యుద్ధం ఆగే వరకు వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తామని వారిని హెచ్చరించారు. అప్పుడే రెండు దేశాలు "తక్షణ కాల్పుల విరమణ , శాంతి" కోసం అంగీకరించాయని ప్రకటించారు.
⚡️ Cambodia and Thailand agree to an immediate and unconditional ceasefire — takes effect from midnight tonight
— TifaniesweTs (@TifaniesweTs) July 28, 2025
RT pic.twitter.com/40IeUmWUMR
రెండు దేశాల మధ్య ఘర్షణలు జులై 24న ప్రారంభమయ్యాయి. థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దు వివాదం శతాబ్దకాలంగా కొనసాగుతోంది. ఘర్షణల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఇరవై మంది, కాంబోడియాకు చెందిన పదమూడు మంది మరణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ప్రేహ్ విహార్ ఆలయం థాయ్ ఆర్టిలరీ దాడుల్లో దెబ్బతిన్నట్లు కాంబోడియా ఆరోపించింది. జులై 25న ఒక అత్యవసర సమావేశం నిర్వహించి, రెండు దేశాలను డీ-ఎస్కలేషన్‌కు పిలుపునిచ్చింది. మలేషియా జులై 25న కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది, దీనిని కాంబోడియా స్వాగతించింది, కానీ థాయ్‌లాండ్ షరతులు విధించింది.
🚨BREAKING: President Donald Trump has claimed responsibility for facilitating a Ceasefire between India and Pakistan.
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2025
In a statement to the European Union Chief, Trump declared:
"...I settled India and Pakistan... I called the Prime Ministers of each (Thailand and Cambodia)… pic.twitter.com/1Q4Qnmbln8
ట్రంప్ కాల్పుల విరమణకు తానే కారణమని పేర్కొన్నప్పటికీ, మలేషియా జులై 25నే కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. థాయ్‌లాండ్ మొదట మూడవ పక్ష మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించింది. ద్వైపాక్షిక చర్చలను ఇష్టపడింది, కానీ ట్రంప్ ఒత్తిడి తర్వాత మలేషియా చర్చలకు అంగీకరించింది. థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య కాల్పుల విరమణ వెంటనే అమలులోకి వచ్చింది.
“同意停火”柬埔寨首相洪玛奈:感谢中美马等国参与调解边境冲突。
— 薯条条条儿(互fo、互动) (@jingy878772) July 28, 2025
Thailand and Cambodia's leaders have agreed to implement a ceasefire starting midnight on Monday, Malaysian Prime Minister Anwar Ibrahim said following a meeting hosted by him here. pic.twitter.com/K1bbUTjBSq





















