News
News
X

Anantapur: అనంతపురం కానిస్టేబుల్ డిస్మిస్ కేసులో ట్విస్ట్! మీడియా ముందుకు బాధితురాలు

బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడారు. ప్రకాశ్‌ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టం చేశారు.

FOLLOW US: 

అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను విధుల నుంచి తొలగించిన అంశంపై ఆ కేసులో పోలీసులు బాధితురాలిగా పేర్కొన్న వ్యక్తి స్పందించారు. తనను బూచిగా చూపి మాత్రమే కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగించారని బాధితురాలు అయిన బి.లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన స్పందన సభకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. తమ బకాయిలు చెల్లించాలంటూ సరిగ్గా అదే టైంలో అనంతపురంలో కానిస్టేబుల్ ప్రకాష్ ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో అతణ్ని విధుల్లో నుంచి తొలగించిన విషయం తెలిసిందే. గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి కానిస్టేబుల్ ప్రకాష్ బంగారం, డబ్బు తీసుకున్నారనే ఆరోపణలపై అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా అనంతపురం ఎస్పీ పకీరప్ప ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడారు. ప్రకాశ్‌ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టం చేశారు. కానిస్టేబుల్‌ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను డిస్మిస్‌ చేశారని వాపోయారు.

‘‘నా భర్త, అతని కుటుంబ సభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను. అక్కడున్న సీఎం వలీ అనే కానిస్టేబుల్‌ నా ఫిర్యాదు రాస్తానని చెప్పి, నా భర్త వేధింపుల గురించి చెప్తే ఆయన మరోలా రాశారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నన్ను వేధిస్తున్నట్లు, అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లుగా రాశారు. ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందరపెట్టి స్టేట్‌మెంట్‌ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నారు. దాని ఆధారంగానే కేసు నమోదుచేసి, అప్పటి డీఎస్పీ వీరరాఘవ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ నాపై అత్యాచారం చేసినట్లు మీడియాతో చెప్పారు. 

డీఎస్పీ ప్రెస్‌ మీట్‌లో చెప్పింది తప్పు అని అప్పట్లోనే నేను టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశాను. సీఐ జాకీర్‌ ఫిర్యాదు తీసుకోకుండా, విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలన్నారు. నేను కోర్టును ఆశ్రయించి డీఎస్పీకి లీగల్‌ నోటీసులు ఇప్పించాను. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా నన్ను బూచిగా చూపించి ప్రకాశ్‌ను డిస్మిస్‌ చేయడం అన్యాయం. డీఎస్పీ మా కుటుంబ పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారు. ఇప్పుడు నా భర్త, పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత’’ అని లక్ష్మి ఆవేదన చెందారు. 

అప్పుడే కానిస్టేబుల్ ప్రకాశ్ పరిచయం
‘‘నా భర్త వేధింపులు తాళలేక ఎన్నోసార్లు గార్లదిన్నె పోలీసులు, జిల్లా ఎస్పీని ఆశ్రయించాను. స్పందనకు హాజరైనప్పుడు ప్రకాశ్‌ పరిచయమయ్యారు. కేసులో నాకు సహకరించారు. అప్పటికే అతనిపై కక్ష పెంచుకున్న ఉన్నతాధికారులు మా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు చిత్రీకరించారు. కానిస్టేబుల్‌ సీఎం వలీ, డీఎస్పీ వీరరాఘవ రెడ్డి ఈ దుష్ప్రచారం చేశారు’’ ఆమె ఆరోపించారు.

Published at : 30 Aug 2022 12:06 PM (IST) Tags: Anantapur SP Anantapur Constable dismiss case AR Constable Prakash Anantapur Constable Issue

సంబంధిత కథనాలు

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

BJP MP Laxman : అభివృద్ధి లేని రాష్ట్రం ఏపీ, మూడు రాజధానుల పేరుతో మభ్యపెడుతున్నారు- ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman : అభివృద్ధి లేని రాష్ట్రం ఏపీ, మూడు రాజధానుల పేరుతో మభ్యపెడుతున్నారు- ఎంపీ లక్ష్మణ్

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

రమణ దీక్షితుల ఆరోపణల్లో వాస్తవం లేదు- తిరుమల అర్చకుల ఆగ్రహం

రమణ దీక్షితుల ఆరోపణల్లో వాస్తవం లేదు- తిరుమల అర్చకుల ఆగ్రహం

బ్రహ్మత్సవాల్లో శ్రీవారి కోసం విదేశీ ఫలాలు- జపాన్ ఆపిల్స్-మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్

బ్రహ్మత్సవాల్లో శ్రీవారి కోసం విదేశీ ఫలాలు- జపాన్ ఆపిల్స్-మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!