![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Roja Controversy: పారిశుద్ధ్య కార్మికులకు రోజా సైగలు- సెల్ఫీ కోసం వస్తే దూరం పెట్టారని నెటిజన్లు ఫైర్
Roja In Tamilnadu: మాజీ మంత్రి రోజా మరో వివాదంలో ఇరుక్కున్నారు. సెల్ఫీ అడిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండాలని చెప్పారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
![Roja Controversy: పారిశుద్ధ్య కార్మికులకు రోజా సైగలు- సెల్ఫీ కోసం వస్తే దూరం పెట్టారని నెటిజన్లు ఫైర్ A video of Roja telling the sanitation workers to stay away from taking selfies is going viral on social media Roja Controversy: పారిశుద్ధ్య కార్మికులకు రోజా సైగలు- సెల్ఫీ కోసం వస్తే దూరం పెట్టారని నెటిజన్లు ఫైర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/c29f309a23901b4f3a92d56df5439b071721190630763215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Roja Controversy: కొందర్ని వివాదాలే వెతుక్కొని వెళ్తుంటాయి. మరికొందరు వివాదాల్నే వెతుక్కొని మరీ సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మాజీ మంత్రి రోజా మాత్రం మొదటి రకం. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ వివాదం చుట్టుముడుతుంది. వివాదాలు ఆమె చుట్టూ వైఫైలా తిరుగుతుంటాయి. ఇప్పుడు కూడా రోజా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
రోజా ఈ మధ్య కాలంలో తమిళనాడులోని ఓ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. రోజా, సెల్వమణి దంపతులు ఇద్దరూ గుడిలో పూజలు చేసి వస్తున్న క్రమంలో సెల్ఫీలు ఇవ్వడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. ఈ టైంలో ఆమె చేసిన సైగలు సమస్యల్లో పడేశాయి. ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మాజీ మంత్రి మొన్న సోమవారం తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణియస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు కూడా చేశారు. దర్శనం చేసుకున్న వస్తున్న టైంలో వారిని చూసిన అక్కడి భక్తులు, సిబ్బంది సెల్ఫీలు ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. రోజా, సెల్వమణి దంపతులిద్దరూ నవ్వుతూ సెల్ఫీలు ఇచ్చారు.
Original video Roja Caste Discrimination:
— 𝗚𝗹𝗮𝘀𝘀𝗶𝘁 (@LetsGlassIt) July 16, 2024
While leaders like DyCM @PawanKalyan are trying to close gap with Sanitation workers by with:
“Nenu mi relli kulasthudini”
YCP leaders still in Caste Discrimination,
Remaining SC/ST should realize & leave YCP pic.twitter.com/S7z3cTq0J6
అయితే గుడిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా రోజాతో సెల్ఫీ దిగుతామని పరుగెత్తుకొని వచ్చారు. అలా వస్తున్న క్రమంలో రోజా వాళ్లకు సైగ చేశారు. అయితే ఆ సైగ హాయ్ చెప్పారో లేకా దూరంగా ఉండాలని చెప్పారో తెలియదు కానీ ఇప్పుడు వివాదానికి ఆ సైగలే కారణమవుతున్నాయి.
పారిశుద్ధ్య కార్మికులు వస్తుండగా దూరంగా ఉండాలంటూ రోజా సైగలు చేశారని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అందరితో చాలా క్లోజ్‌గా ఉంటూ ఫొటోలు దిగిన రోజా పారిశుద్ధ్య కార్మికులను మాత్రం దూరం పెట్టారు. దీన్నే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)