By: ABP Desam | Updated at : 20 Feb 2023 03:59 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పృధ్విరాజ్
Janasena BRS Alliance : తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆఫర్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలపై జనసేన నేత పృధ్వి రాజ్ స్పందించారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి వార్తలు వేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో తనకు రూ. 200 కోట్లు ఇచ్చారని వార్తలు వేశారన్నారు. ఆ రూ.200 కోట్లు లెక్క పెట్టి రావడానికి ఇన్ని రోజులు పట్టిందని వ్యంగ్యంగా అన్నారు. జనం కోసం పుట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఎవరి ఆఫర్ల కోసం ఆశపడే వ్యక్తి కాదన్నారు. ట్యాక్స్ కట్టడానికే రూ.9 కోట్ల అప్పు చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని గుర్తుచేశారు. అలాంటి వార్తలు వేస్తే సర్క్యూలేషన్ వస్తాయని కొందరు ఇలా చేశారన్నారు. తారకరత్న మరణంపై లక్ష్మీ పార్వతి మాటలు బాధాకరమన్నారు. ఆమె అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదన్నారు. లోకేశ్ ఐరన్ లెంగ్ అంటూ ఆయన పాదయాత్ర వల్లే తారకరత్న చనిపోయారని లింక్ చేస్తూ చెప్పడం దారుణం అన్నారు.
"ఇదంతా పబ్లిసిటీ స్టంట్. అలాంటిది ఏమైనా ఉంటే నాదెండ్ల మనోహర్, నాగబాబు ఖండిస్తారు. జనానికి ఏమైనా చేయడానికి వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. పేపర్ల సర్క్యూలేషన్ కోసం ఇలాంటి వార్తలు రాస్తుంటారు. ఓ సినిమా తీశాను. అది హిట్ అవ్వాలని తిరుమల వచ్చాను. నా అసలు మొక్కు 2024 మీకు తెలియజేస్తాను. కన్నా లక్ష్మీనారాయణ నాకు గురువు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అక్కడ ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని బయటకు వచ్చారు. తారకరత్న సడెన్ గా వెళ్లిపోవడం అనేది చాలా బాధాకరం. ప్రతీది లింక్ పెట్టి మాట్లాడకూడదు. లక్ష్మీ పార్వతి తారకరత్న మరణంపై చేసిన తప్పు" - పృధ్విరాజ్, సినీ నటుడు, జనసేన నేత
జనసేన, బీఆర్ఎస్ పొత్తుపై జోరుగా ప్రచారం
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్... జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని ఒక్క సారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుప్పు మంది. దీనికి కారణం ఏదైనా కొంత కాలం నుంచి ఈ అంశంపై రాజకీయవర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించడంతో బయటకు వచ్చింది. దీనిపై జనసేన వర్గాలు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ వర్గాలు కూడా సైలెంట్‌గా ఉన్నాయి. సోషల్ మీడియాలో మాత్రం జనసేన కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కారణం ఏమైనా బీఆర్ఎస్, జనసేన మధ్య చర్చల విషయాన్ని కొట్టి పారేయలేమని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి.
జాతీయ పార్టీగా మారాక కలసి వచ్చే వారి కోసం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు !
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కలసి వచ్చే వారి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన అనుకుంటున్నారు. అయితే బలమైన, ప్రజాకర్షణ ఉన్న నాయకుడు కావాలి. అలాంటి నాయకుల కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు చాలా వరకూ ఫెలయ్యాయి. అందుకే ప్రధాన పార్టీల తరపున మూడు సార్లు పోటీ చేసినా ఓడిపోయిన తోట చంద్రశేఖర్‌కుఏపీ బీఆర్ఎస్ బాధ్యతలిచ్చారు. అయితే కనీసం బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసేలా ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నిద బహిరంగ రహస్యమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్‌కు ఓ బలమైన సమాజికవర్గం అండ ఉంటుంది కాబట్టి.. ఆయనతో కలిసి పోటీ చేస్తే మెరుగైన పలితాలు వస్తాయన్న కేసీఆర్ అంచనాతోనే... జనసేన పార్టీని సంప్రదిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
జనసేన పార్టీతో బీఆర్ఎస్ నేతల సంప్రదింపులు !
అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగా ఎన్నికల ఖర్చు గురించి కాదు కానీ.. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్‌ను కొంత మంది బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఏపీ రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎలా మారతాయి. బీఆర్ఎస్ , పవన్ కల్యాణ్ కలిస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయి అన్నవాటిపై లోతైన పరిశీలనతో... బీఆర్ఎస్ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది మొత్తం బీఆర్ఎస్ వైపు నుంచి ఏపక్షంగా జరుగుతోంది కానీ పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎలాంటి ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు.
వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "
APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి మరమ్మత్తులు, వాహన రాకపోకలు నిలిపివేత
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం
MP R Krishnaiah : ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?