By: ABP Desam | Updated at : 01 Jul 2022 08:44 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల బ్రహ్మోత్సవాలు
Tirumala Brahmotsavam 2022 : నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా భాసిలుతున్న తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఊరేగింపు నిర్వహిస్తూనే ఉంటారు. తిరుమలలో ఏడాది పొడవునా ప్రతిరోజు పండుగే. తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. వేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలి రోజులలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుణి పిలిచి లోకకళ్యాణార్థం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడటా, శ్రీవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మ దేవుడు, శ్రీవారు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రవణా నక్షత్రానికి పూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహించారటా, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని అంటారు.
తొమ్మిది రోజుల పాటు
నిత్యకల్యాణం పచ్చతోరణమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది రోజుల పాటు శ్రీవారు భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే ఈ మహాత్తర ఘట్టానికి తిరుమలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఏటా కన్యామాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణంతో ముగిసేలా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది సెప్టెంబరు 27వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాల నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు వాహానాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం సూచికగా ముందురోజు సెప్టెంబరు 26న ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు.
వాహన సేవలు
బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు స్వామి ఊరేగే వాహనం పెద్దశేష వాహనం, రెండో రోజు ఉదయం చిన్నశేషవాహనంపై దర్శనమిస్తే, అదే రోజు రాత్రి సరస్వతి మూర్తిగా హంస వాహనంపై శ్రీవారు దర్శనం ఇస్తారు. ఇక మూడో రోజు ఉదయం సింహ వాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంలో అధిరోహించనున్నారు. నాలుగోవ రోజు ఉదయం కల్పవృక్షవాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై, ఇక ఐదోవ రోజు ఉదయం మోహిని అవతారంలో దర్శనమిస్తే, అదే రోజు రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంకాలం స్వర్ణరథం, రాత్రి గజ వాహనం, ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, ఎనిమిదో రోజు ఉదయం రధోత్సవం, అదే రోజు అశ్వ వాహనం, ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు చక్రస్నానం నిర్వహించనున్నారు. తొమ్మిదో రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించగా, బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ యంత్రాంగం గత మూడు నెలలుగా నిరంతరాయంగా ఏర్పాట్లుచేస్తుంది. ఇవాళ అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సాలు ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీ ప్రారంభం అవుతాయి.
ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
సెప్టెంబర్ 27వ తేదీన సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని, బ్రహ్మోత్సవాలు సమయంలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందనే అంచనాకు టీటీడీ అధికారులు వచ్చారు. మూడో శనివారం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>