By: ABP Desam | Updated at : 06 Apr 2022 08:45 PM (IST)
కొత్త జిల్లాలకు కోడ్‌లు కేటాయించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్రం ప్రత్యేకంగా కోడ్‌లు జారీ చేసింది. జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరక్టరీ కోడ్‌లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లను కొత్త జిల్లాలకు జారీ చేసింది. వీటికి స్థానిక ప్రభుత్వాల మ్యాపింగ్‌కు ప్రత్యేకంగా ఎల్‌జీడీ కోడ్‌లను జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. జనగణన నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నీ కోడ్ ద్వారానే అమలు అవుతాయి. ఈ కోడ్‌ల ఆధారంగా జిల్లాల వారీగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు.
మంత్రి పదవి రేస్‌లో ఉన్న కల్యాదుర్గం ఎమ్మెల్యేకు షాక్- ప్యూజ్‌లు పీకేస్తున్న సొంత పార్టీ నేతలు
ఈనెల 4 నుంచి ఏపీలో మరో 13 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పాలనను ప్రారంభించింది. ఆ జిల్లాలకు మాత్రం కొత్త కోడ్‌లు కేటాయించారు. పాత జిల్లాలకు వాటికి గతంలో ఉన్న కోడ్‌లే ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించారు.
11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం - గవర్నర్‌కు తెలిపిన సీఎం జగన్ !
దేశంలో ఒక్కో జిల్లాకు ఒక్కో కోడ్ ఉంటుంది. ఆ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 755 జిల్లాలు ఉంటాయి. మామూలుగా జనగణన అయ్యే వరకూ జిల్లాల సరిహద్దులు మార్చవద్దని గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూండటంతో ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో వెసులుబాటు ఇచ్చారు. జూన్‌లోపు జిల్లాల సరిహద్దులు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం అంత కంటే ముందుగానే ఏప్రిల్ కల్లా పూర్తి చేయడం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే కోడ్‌లు జారీ అయ్యాయి.
ఎన్ని సార్లు దొరికినా లంచాలు ఆపడే ఆనంద్ రెడ్డి - మళ్లీ డిస్మిస్ ఖాయం !?
కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. తెలంగాణ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల్లోని జిల్లాల సమాచారం పొందుపరిచే కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో జిల్లాల పేర్లు పొందుపరిస్తే సరిపోతుంది. కోడ్‌లు మంజూరు చేయడంతో ఇప్పుడు కేంద్రం ఆమోదముద్రపడినట్లయింది.
Gold-Silver Prices Today 04 December 2023: చుక్కల్లో చేరిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Telangana Results Sunil Kanugolu : కాంగ్రెస్ విజయం వెనుక తెర వెనుక శక్తి సునీల్ కనుగోలు - పీకేను మించిన స్ట్రాటజిస్ట్ అయినట్లేనా ?
KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Weather Latest Update: నేడు బంగాళాఖాతంలో తుపాను, అతి భారీ వర్ష సూచన: ఐఎండీ
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>