Jagan Meet Governer : 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం - గవర్నర్‌కు తెలిపిన సీఎం జగన్ !
పదకొండో తేదీన మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని గవర్నర్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ వారం రోజులుగా రాష్ట్రంలో లేరు. సొంత రాష్ట్రం ఒరిస్సాతో ఢిల్లీలో పర్యటించారు. మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు ( Rajbhavan ) చేరుకున్నారు. ఈ వారంలో రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ( New Districts ) ఏర్పాటు చేయడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిపై వివరణ ఇవ్వడంతో పాటు కొత్తగా సీఎం జగన్ మంత్రి వర్గాన్ని ( New Cabinet ) విస్తరించబోతున్నారు. వీటిపైనా గవర్నర్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఎన్ని సార్లు దొరికినా లంచాలు ఆపడే ఆనంద్ రెడ్డి - మళ్లీ డిస్మిస్ ఖాయం !?
ఈ నెల పదకొండో తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి (Oath Taking ) ఏర్పాట్లు చేయాలని ఆయన రాజ్‌భవన్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. గురువారం మంత్రివర్గ భేటీ ( Cabinet meet ) అనంతరం మంత్రులందరి రాజీనామాలను తీసుకుంటారు. వాటిని రాజ్భవన్‌కు పంపి ఆమోదం తీసుకుంటారు. దీంతో అధికారికంగా మంత్రుల స్థానాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఆ తర్వాత కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్ గవర్నర్‌కు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై కసరత్తు పూర్తి చేసి తన టీంను ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏడో తేదీన మంత్రులందరూ రాజీనామాలు (Ministers Resign ) చేస్తే .. పదకొండో తేదీన అందరూ ప్రమాణం చేసే అవకాశం ఉంది.
సామాజిక సమీకరణాలు కలిసొచ్చిన వారే మినిస్టర్స్ ! అదృష్టవంతులు వీళ్లేనా ?
మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ఆర్‌సీపీలోని ( YSRCP )ఆశావహులు పెద్ద ఎత్తున మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చాలా మందికి నిరాశే ఎదురు కానుందని తెలుస్తోంది. ఎవరూ ఊహించని వారికి మంత్రి పదవులు దక్కబోతున్నాయని చెబుతున్నారు. సామాజికవర్గాల సమీకరణాలు తీసుకుని ఎవరైతే అత్యంత విధేయంగా ఉంటారో వారికి మాత్రమే చాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సీనియార్టీ గురించి జగన్ పట్టించుకోరని భావిస్తున్నారు. అయితే చివరి క్షణం వరకూ ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయో వారికి తప్ప వేరే వారికి తెలిసే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అందర్నీ మారుస్తారా లేకపోతే.. ఒకరిద్దరికి కొనసాగింపు ఉంటుందా అన్నదానిపైనా క్లారిటీ లేదు.