Crime News : ఎన్ని సార్లు దొరికినా లంచాలు ఆపడే ఆనంద్ రెడ్డి - మళ్లీ డిస్మిస్ ఖాయం !?
డబ్బులిస్తే చాలు రోడ్లు, శ్మశానాలు, డ్రైనేజీలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తాడు సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి. అందులోనే ఆయనకు ఆనందం. పలుమార్లు దొరికినా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి దొరికాడు.
సబ్ రిజిస్ట్రార్ పని ఏమిటి .. రిజిస్ట్రేషన్లు చేయడం. చట్ట పరంగా అన్నీ కరెక్ట్ గా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ అందరూ అలాగే ఉండరు. ఎక్కడో ఓ చోట ఆనంద్ రెడ్డి లాంటి వారు ఉంటారు. ముందూ వెనుకా చూసుకోరు. తనకు డబ్బులిస్తే చాలు తాజ్ మహల్‌ను అయినా రిజిస్ట్రేషన్ చేసిచ్చేస్తానంటారు. అలాంటి ఆనంద్ రెడ్డి మరోసారి దొరికిపోయి సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు.
41 ఏళ్లు అతడు సినిమా చూపించాడు - కోర్టు తీర్పుతో సీన్ రివర్స్, కుటుంబసభ్యులు షాక్
తిరుపతి శివారు రేణిగుంట లో సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డిని ప్రభుతవం మరోసారి సస్పెండ్ చేసింది. మూడేళ్ల క్రితం తిరుపతి సబ్ రిజిస్టర్ గా పని చేస్తూ రికార్డులను తారుమారు చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. అయితే అనేక ప్రయత్నాలు చేసి ఏడాదిన్నర కిందట మళ్లీ పోస్టింగ్ తెచ్చుకున్నారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ గా తిరిగి విధుల్లో జాయిన్ అయ్యారు. అయితే పాత బుద్ది మాత్రం పోనిచ్చుకోలేదు. ఏపీలో ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉండటంతో చెలరేగిపోయారు. అనేక చోట్ల భూములను రేణిగుంటలో రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు తెర తీశాడు.
సెల్‌ఫోన్ ఇవ్వడానికి నిరాకరించిన ప్రియురాలు- పోలీసులు వచ్చి ప్రియుడ్ని ఎత్తుకెళ్లారు
అలాగే పలు పంచాయతీల్లో రోడ్లు, ప్రభుత్వ భూములను కూడా ఆనంద్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది.. పలు రిజిస్టేషన్లలో అడిగినంత లంచం ఇవ్వలేదని ఏకంగా ఆస్తులనే వివాదాల్లోకి నెట్టిన ఘనుడుగా ఆనంద్ రెడ్డి పేరు ఉంది.. తిరుపతి రూరల్ లో కావాలనే ఒక వివాదం సృష్టించి ప్రముఖ బిల్డర్ వద్ద నుండి శ్రీనివాసపురం వద్ద అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్ లో సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు కొత్త జిల్లాల్లో భూముల విలువ ప్రభుత్వం పెంచడాన్ని సాకుగా చేసుకుని ఇష్టారాజ్యంగా భూముల ధరలను పెంచి రిజిస్ట్రేషన్లు చేసేశారు.
ప్రాణం తీసిన పోస్ట్ వెడ్డింగ్ షూట్- నదిలో కొట్టుకుపోయిన నవ జంట
సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డిపై ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ల శాఖ సీరియస్ అయింది..ఆనంద్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శాఖాపరమైన విచారణ పూర్తిస్థాయిలో జరిగిన తరువాత ఆనంద్ రెడ్డిని ప్రభుత్వం మరోసారి డిస్మిస్ చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆనంద్ రెడ్డికి చాలా పలుకుబడి ఉందని ఆయన మరోసారి సబ్ రిజిస్ట్రార్‌గా వస్తాడని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.