By: ABP Desam | Updated at : 05 Apr 2022 05:36 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో ఓ యువతి కనిపించకుండా పోయింది. ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాకపోవడంపై తల్లిదండ్రులు కంగారు పడ్డారు.
ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన మహేష్‌పూర్ పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారిస్తుండగానే సోమవారం ఉదయం ఓ యువతి డెడ్‌బాడీని ఊరి శివారులో గుర్తించారు స్థానికులు. వెళ్లి చూస్తే కనిపించకుండా పోయిన యువతి డెడ్‌బాడీగా మారిందని తేలింది. అయితే ఎవరు ఈ హత్య చేసి ఉంటారనే కోణం దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు ముందుగా ఫ్యామిలీ మెంబర్‌ను విచారించారు. తెలిసి వ్యక్తితో ఆమె రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉందని తేలింది. వాళ్లిద్దరూ తరచూ బయటకు వెళ్లేవారు.
ఈ కేసులో ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు సంగతి వెలుగు చూసింది. తనే హత్య చేసినట్టు ప్రియుడు అంగీకరించాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని.. చాలా బహుతులు ఆమెకు కొని ఇచ్చానని చెప్పాడాయన.
ఈ మధ్య కాలంలో ఆమె తల్లిదండ్రులు యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు. అతనికి ఇచ్చి చేయడం వాళ్లకు ఇష్టం లేదు. అందుకే ఇష్టపూర్వకంగా విడిపోవడానికి వీళ్లిద్దరు నిర్ణయించుకున్నారు.
విడిపోయే క్రమంలో గతంలో తను బహుమతిగా ఇచ్చిన సెల్‌ఫోన్ తిరిగి ఇచ్చేయాలని యువకుడు ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. తాను ఆ ఫోన్ ఇవ్వబోనంటూ తెగేసి చెప్పిది.
తాను కొనిచ్చిన సెల్‌ఫోన్ ఇవ్వడానికి నిరాకరించిన యువతిపై కోపం పెంచుకున్నాడు యువకుడు. ఆ కోపాన్ని మనసులోనే దాచుకొని ఎప్పటిలాగానే ఆమెతో సరదాగా నటించాడు. ఆదివారం ఫుట్‌బాల్ మ్యాచ్ చూద్దామని తీసుకెళ్లి చంపేశాడు. గుట్టు చప్పుడు కాకుండా డెడ్‌బాడీని ఊరి శివారులో పారేశాడు. ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేశాడు.
ప్రియుడు చెప్పిన విషయంతో పోలీసులు షాక్ తిన్నారు. ఫోన్ తిరిగి ఇవ్వకుండా ప్రాణాలు తీయడమేంటని ఆశ్చర్యపోయారు.
Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !
Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !
Nalgonda: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త
Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?