అన్వేషించండి

Three Capitals : మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నాం.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో అనుబంధ అఫిడవిట్ !

శుక్రవారం రాజధాని బిల్లుల అంశంపై దాఖలు చేసినఅఫిడవిట్లకు అదనంగా శనివారం ప్రభుత్వం మరో అఫిడవిట్ సమర్పించింది.మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో మరో అనుబంధ అఫిడవిట్‌ను హైకోర్టులో సమర్పించింది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అఫిడవిట్‍కు అనుబంధంగా కొత్తగా తెచ్చిన బిల్లులను కోర్టుకు ఏపీ ప్రభుత్వం సమర్పించింది. ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అందులో ప్రభుత్వం స్పష్టంచేసింది.  రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే ఈ బిల్లులు ఉపసంహరించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

Also Read : జగన్ పాలన ఫెయిల్ - ఏపీలో ప్రజాస్వామ్యం లేనట్లేనన్న ఉండవల్లి అరుణ్ కుమార్ !

చట్టం రద్దు ద్వారా సీఆర్డీఏను పునరుద్ధరించామని..ప్రభుత్వం తెలిపింది. అఫిడవిట్‌లో శ్రీబాగ్ ఒప్పందం గురించి ప్రభుత్వం ప్రస్తావించింది. శుక్రవారమే ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ మేరకు శాసన సభ, మండలి సమావేశాల్లో ఉప సంహరణ బిల్లులను ఆమోదించినట్లు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రభుత్వం తరుఫున అఫిడవిట్‌ను సమర్పించారు. ఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని గత రెండేళ్లుగా రైతులు, ఐక్యకార్యచరణ నాయకులు కోర్టులో పిటిషన్లు వేశారు. 

Also Read : త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

ఈ కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం రోజువారీగా విచారిస్తుంది. ఈ కేసుల విచారణ తుది దశకు వస్తున్న తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తమ బిల్లులను మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 26 వరకు ఇందు కోసం గడువును హైకోర్టు ఇచ్చింది. 

Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !

26న అఫిడవిట్లు సమర్పించిన ప్రభుత్వం 27న మరో అనుబంధ అఫిడవిట్ సమర్పించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అనుబంధ అఫివిట్‌లో శ్రీబాగ్ ఒప్పందం వంటివి ప్రస్తావించడంతో  న్యాయస్థానంలో వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ అంశంపై రైతు తరపు న్యాయవాదులు అఫిడవిట్లను అధ్యనం చేస్తున్నారు. వీటిపై సోమవారం హైకోర్టులో వాదనలు సాగే అవకాశం ఉంది. 

Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget