అన్వేషించండి

Undavalli : జగన్ పాలన ఫెయిల్ - ఏపీలో ప్రజాస్వామ్యం లేనట్లేనన్న ఉండవల్లి అరుణ్ కుమార్ !

ఏపీలో జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. రాజమండ్రి మీడియా సమావేశంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన విఫలమయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చేశారు. రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ కొత్త సంప్రదాయం ప్రారంభించిందని.. విపక్షం లేకుండా సభ నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అప్పులపై నియంత్రణ లోపించిందని స్పష్టం చేశారు. 

Also Read : త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు అప్పులు పెరిగాయని, గడిచిన రెండేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం 3 లక్షలకు పైబడి అప్పులు చేసిందని లెక్కలు చెప్పారు. కాగ్ నివేదికపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.  ముందు ముందు అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుందని ఉండవల్లి మండిపడ్డారు.  అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా ఇచ్చారు. 

Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !

అసెంబ్లీలో సభ్యుల భాష గీత దాటిపోయిందని ఉండవల్లి మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తెపై అసెంబ్లీలో కొంత మంది ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు  చేయడాన్ని ఉండవల్లి తప్పు పట్టారు. హరికృష్ణ, పురందేశ్వరితో తనకు పరిచయం ఉందని..వారుచాలా మంది వాళ్లన్నారు. అదేసమయంలో ఎన్టీఆర్ కుమార్తెలపై తాను ఎలాంటి చెడు ప్రచారాలనూ వినలేదన్నారు. అంత దారుణంగా తిట్టినందుకే చంద్రబాబు విలపించారని ఆయనది డ్రామా అని తాను అనుకోవడం లేదన్నారు. సానభూతి రాదని చంద్రబాబుకూ తెలుసన్నారు.  

Also Read : రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి.. ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం !

వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ ప‌ర్యటించకపోవడంపై విమర్శలు గుప్పించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎప్పుడైనా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పర్యటించారా అని జగన్ అసెంబ్లీలో ప్రశ్నించడంపై ఉండవల్లి విమర్శలు గుప్పించారు.  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై ఎలాంటి ఆరోపణలు లేవని అందుకే గెలుస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అవినీతి లేనిదెక్కడో చూపించాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడం కనీస బాధ్యత అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని.. ఆయన బాగా పని చేస్తున్నారని ఉండవల్లి తేల్చారు. 

Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !

చంద్రబాబును అంత దారుణంగా తిడుతున్నారని.. అలాంటి వారికి ప్రజల్లో గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఓ మంత్రి అయితే వాడు,వీడు అనడం సాధారణం అయిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితులతో ఏపీలో  అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ఉండవల్లి విమర్శించారు. 

Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget