Ganja Odhu Bro : గంజాయి వద్దు బ్రో - టీడీపీ కొత్త ప్రచారం !
గంజాయికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. యువగళం పాదయాత్రలో గంజా వద్ద బ్రో నినాదాలతో ఉన్న టీ షర్టులు కార్యకర్తలు ధరించారు.
Ganja Odhu Bro : తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమం చేపట్టింది. గంజా వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్ ప్రారంభించింది. లోకేష్ పాదయాత్రలో ఈమేరకు యువత నినాదాలతో కూడిన టీ షర్టులను వాలంటీర్లు దరించారు. గంజాయి వద్దు బ్రో అంటూ రాసి ఉన్న క్యాప్, టీ షర్టులను యువత డ్రగ్స్కి దూరంగా ఉండాలి అంటూ మెసేజ్ ఇస్తున్నారు. ఈ గంజాయి ఏపీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని లోకేష్ మండిపడ్డారు. గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని సీఎం జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆఖరికి తిరుమలని కూడా వైసీపీ గంజాయి మాఫియా వదలడం లేదు. చివరకు తిరుమలలో కూడా గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
First step in our war against the menace of Ganja in Andhra Pradesh has been taken. A largescale #GanjaOdhuBro campaign was launched today by @jaitdp to create awareness about the ill-effects of Ganja and drugs on youth. Walked with Bala Mavayya as part of it... pic.twitter.com/ibvCtOumlo
— Lokesh Nara (@naralokesh) April 7, 2023
గంజాయి వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. టీడీపీ హయాంలో రూ. 40వేల కోట్లు విలువ చేసే గంజాయిని తగలబెడితే ఇప్పుడు ఏకంగా వైసీపీ నాయకులు గంజాయి పంట వేస్తున్నారు. పాదయాత్రలో ఉండగా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయికి బానిస అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తల్లి చెప్పిన మాటలు నన్ను కలచివేశాయి. అందుకే గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. టీడీపీ హయాంలో పెట్టిన డీఎడిక్షన్ సెంటర్లు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. యువత అంతా డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి అని పిలుపు ఇస్తున్నా.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ గంజాయి మాఫియాపై చర్యలు తీసుకుంటాం. గంజాయి వద్దు బ్రో..యువత గంజాయికి దూరంగా ఉండాలి అంటూ’’ లోకేష్ పిలుపునిచ్చారు.
We are launching the #GanjaOdhuBro campaign today to create awareness about the rising Ganja culture in AP that is destroying the future of youngsters. We will fight until the drug menace ends. pic.twitter.com/76rfu4Lr5d
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2023
టీడీపీ హయాంలో 40వేల కోట్ల రూపాయిలు విలువ చేసే గంజాయిని తగలబెడితే... ఇప్పుడు ఏకంగా వైసిపి నాయకులు దాని పంట వేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఉండగా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి.. తన కుమార్తె మాదక ద్రవ్యాలకు బానిస అయ్యింది అని చెప్పిందని.. ఆ సంఘటన తనను కలచివేసిందన్నారు లోకేష్. అందుకే గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిడిపి హయాంలో పెట్టిన డి ఎడిక్షన్ సెంటర్లను కూడా వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. యువత అంతా డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసిపి ఈ మాఫియాపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.