అన్వేషించండి

AP Assmebly : కాల్ ది మార్షల్స్ అండ్ పుల్ దెమ్ అవుట్ - ఏపీ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్ ! ఎందుకంటే ?

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులను శుక్రవారం కూడా సస్పెండ్ చేశారు. వారు బయటకు వెళ్లకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Assmebly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు. రెండో రోజు సభ ప్రారంభం కాగానే పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వెల్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు.టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 

టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం 

సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని... దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు. తర్వాత   టీడీపీ సభ్యులపై  ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వారు బయటకు వెళ్లకపోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ ది మార్షల్స్ అండ్ పుల్ దెమ్ అవుట్ అని ఇంగ్లిష్‌లో ఆవేశంగా స్పందించారు. 

విభజన చట్టంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని లేదని.. పరిశీలించాలనే ఉందని  సభకు చెప్పిన బుగ్గన 

అంతకు ముందు  ప్రశ్నోత్తరాల సమయంలో కడప స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ సభ్యులు కడప స్టీల్ ప్లాంట్‌పై ప్రశ్నిచారు.  కేంద్రాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అధికారపక్ష సభ్యులను ప్రశఅనించారు. . దీనిపై మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చారు.  టీడీపీ సభ్యులు సబ్జెక్టుకు కన్పైన్ కావడం లేదన్నారు. కడప స్టీల్ పెట్టేందుకు ఆలోచించొచ్చు అని  విభజన చట్టంలో ఉందన్నారు. కోవిడ్ వల్ల ప్రపంచ వ్యీప్తంగా స్టీల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని వెల్లడించారు. విభజన చట్టంలో ఏముందో సరిగా చూడాలన్నారు.  మంత్రి అమర్నాథ్  రెండున్నర సంవత్సరాలు పాటు కోవిడ్ వల్ల ఆలస్యం అయ్యింది. ల్యాండ్‌కు సంభందించి ముప్పై ఏడున్నర కోట్లు కాంపన్షేషన్ చెల్లించాం’ అని సమాధానం ఇచ్చారు. 

రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !

చర్చలపై ఎవరి వాదన వారిదే.. సస్పెన్షన్ వేటుకే అధికారపక్షం మొగ్గు !

తెలుగుదేశం పార్టీ సభ్యులను గతంలోనూ వరుసగా సస్పెండ్ చేస్తూ వెళ్లారు. ఈ సమావేశంలోనూ సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తాము ప్రతిపాదించిన వాటిపై చర్చించాలని పట్టుబడుతున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం అన్నీ చర్చిద్దాం కానీ.. విడిగా సమయం కేటాయిస్తామని చెబుతోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుసగా సస్పెండ్ అవుతూండటంతో  సభ ఏకపక్షంగా సాగుతోంది.  అర్థవంతమైన చర్చలు జరగకపోవడంతో  రాజకీయ వర్గాల్లోనూ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి కనిపించడం లేదు. 

ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, ఆయనకే ఛాన్స్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Special Herbal Soup | తిరుపతిలో ప్రాచుర్యం పొందుతున్న హెర్బల్ సూప్ కార్నర్ | ABP DesamIdeas of India 2025 | ఎలన్ మస్క్ గురించి గోయెంకాల వారసుడు ఏం చెప్పారంటే | ABP DesamIdeas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP DesamIdeas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Andhra Pradesh Group 2 Exam: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
Farmer Protest: రుణమాఫీ చేయాలే-గాంధీభవన్ మెట్లపై రైతు ధర్నా- వీడియో వైరల్
రుణమాఫీ చేయాలే-గాంధీభవన్ మెట్లపై రైతు ధర్నా- వీడియో వైరల్
Embed widget