(Source: ECI/ABP News/ABP Majha)
Merugu Nagarjuna Comments : రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !
రోజా దళితుల్ని అవమానంచలేదని ఆమెకు దళితులంటే చాలా గౌరవం ఉందని మంత్రి నాగార్జున ప్రకటించారు. గతంలో ఆమె అన్న మాటల్ని వక్రీకరించారన్నారు
Merugu Nagarjuna Comments : ఏపీ మంత్రి రోజా దళితులను ఎప్పుడూ అవమానపర్చలేదని .. గతంలో ఓ పోలీసు అధికారితో అన్న వివాదాస్పద వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి మెరుగు నాగార్జున వివరించారు. మంత్రి రోజా గతంలో తిరుపతిలో దర్నా చేస్తున్నప్పుడు పోలీసులు దూరంగా నిలబడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఆమె దళితులను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికీ వైరల్ అవుతోంద. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. ఆమె మాటలను వక్రీకరించారని..రోజాకు దళితుల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు.
చంద్రబాబే దళితుల్ని అవమానించారని మెరుగు నాగార్జున ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబే దళితుల్ని అవమానించారని మండిపడ్డారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు దగ్గర ఇంకా ఎందుకున్నారోనని బాధకలుగుతుందని.. చంద్రబాబు దగ్గర మీరెందుకు ఇంకా ఛప్రాసీ ఉద్యోగం చేస్తున్నారో అర్ధం కావడం లేదని టీడీపీ నేతలను ఉద్దేశించి ్నారు. నిజంగా దళితుల్లో పుట్టిన వారెవరూ చంద్రబాబు దగ్గర ఉండరని మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. దళితులను వాడుకుని వంచించిన వ్యక్తి చంద్రబాబు..అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి మోసం చేశారన్నారు. ఏమీ లేని చోట చెట్లు, పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా ..చంద్రబాబు మోసాలను ఎండగట్టడానికి అంబేద్కర్ పాదాల సాక్షిగా ఎక్కడైనా చర్చకు సిద్ధమని మెరుగు నాగార్జున ప్రకటించారు.
వేమూరు పాదయాత్రలో రాజధాని రైతులు లేరు !
రాజధానికి సంబంధించి వేమూరు నియోజకవర్గంలో టీడీపీ పాదయత్రలు చేస్తోందని... ఆ పాదయాత్రలో రాజధాని ప్రాంత రైతులు, దళితులు ఎంత మంది ఉన్నారని నాగార్జున ప్రశ్నించారు. మీ ఉద్యమంలో ఉన్నవారంతా బయటి నుంచి వచ్చినవారేనన్నారు. నక్కా ఆనంద్ బాబుకు.. జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా ముఖ్యమంత్రి పై టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడతున్నారని... టీడీపీ నేతలు ప్రజల్లో మనగలిగే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్, వైసీపీ పార్టీ ఏర్పాటు కోసం జగన్ ధైర్యంగా రాజీనామాలు చేశారు ..మీకు దమ్ముంటే మీవాళ్లంతా రాజీనామా చేయండి ...ఎన్నికలకు వెళ్దాం అని సవాల్ చేశారు.
టీడీపీ దళిత ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలతో నాగార్జున తీరు వివాదాస్పదం
రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయానని మీరే చెప్పారని టీడీపీ నేతలను ఉద్దేశించి నాగార్జున వ్యాఖ్యానించారు. అందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నామన్నారు. అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని ఉద్దేశించి మెరుగు నాగార్జున దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తల్లిదండ్రుల్ని కూడా అవమానించారని.. స్పీకర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ రికార్డులు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏ చర్యా తీసుకోలేదు. ఈ అంశంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.