Ambati Rambabu: అంబటి రాంబాబుకు చీర, జాకెట్, పూలు - టీడీపీ మాస్ ప్రొటెస్ట్
AP News Latest: అంబటి రాంబాబుకు ఇచ్చేందుకు చీర, జాకెట్టు, పూలు తీసుకొని నిరసనగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు వెళ్లారు. ఆయన సుకన్య, సంజనలతో కలిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పారు.
Ambati Rambabu Sattenapally News: ఏపీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు మాస్ ర్యాగింగ్ చేశారు. ఆయన ఇంటిని తెలుగు యువత (టీఎన్ఎస్ఎఫ్) నేతలు ముట్టడించారు. అంబటి రాంబాబుకు ఇచ్చేందుకు చీర, జాకెట్టు, పూలు తీసుకొని నిరసనగా వెళ్లారు. అంబటి రాంబాబు సుకన్య, సంజనలతో కలిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందించినట్లుగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు చెప్పారు. అయితే, అంబటి రాంబాబు ఇంటికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అంబటి ఇంటి ముందు చీర, జాకెట్టు, పూలను తెలుగు విద్యార్థి నేతలు కుర్చీలో పెట్టి వెళ్లారు.
అంబటి రాంబాబు మంత్రి అయినప్పటి నుంచి వెటకారంగా మాట్లాడారని, శ్రుతి మించిన ఆయన వ్యాఖ్యల వల్లే తాము ఈ నిరసన చేపట్టినట్లుగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. తల్లి లాంటి భువనేశ్వరిపై నిందలు మోపిన అంబటి రాంబాబుకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ అంబటి రాంబాబు జోకర్ తరహాలో వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అంబటి రాంబాబు తమ నాయకులపై ఇష్టమొచ్చిన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు.