By: ABP Desam | Updated at : 04 Sep 2021 02:49 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వాలంటీర్ లేఖ వైరల్(ప్రతీకాత్మక చిత్రం)
ప్రజలను సోమరిపోతులను చేయెుద్దంటూ ఓ వాలంటీర్ లేఖ రాశారు. పింఛను నిబంధనలను మార్చేశారని, ఈ-కేవైసీ అవ్వకపోవడం వల్ల తీసుకోలేకపోయారని వాలంటీర్ ఆవేదన చెందారు. ఆ బకాయి పింఛన్ ను ఈ నెల ఇవ్వవద్దన్నారని లేఖలో తెలిపారు. పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతుందని, కానీ ఎంతోమంది నిరుపేదలు పింఛన్లు అందడంలేదన్నారు. అనేక పథకాలు తీసుకువచ్చి ప్రజలకు నేరుగా డబ్బులిస్తున్నారని, ప్రజలను సోమరిపోతులను చేయొద్దని లేఖలో తెలిపిపారు. అది మంచిది కాదన్నారు. సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని కోరారు. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీర్ చిట్టివలస కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి
సీఎం జగన్‌మోహన్ రెడ్డి పథకాలపై కాక ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన లేఖలో కోరారు. వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వాలంటీర్లకు రూ.5 వేల జీతం ఇస్తున్నారని ఇవి పెట్రోలుకూ సరిపోవట్లేదన్నారు. ఉద్యోగభద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు.
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
చిత్తూరు జిల్లాలో 74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపింది. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం నిరసన చేశారు. గ్రామపంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరు కామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల మండలంలోని వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈవోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 74 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, మానసికంగా వేధించారని ఆరోపించారు. ఆమెపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై స్థానిక నేతలు పెత్తనాలు మానుకోవాలని ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?
ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?
Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?
Animal Telugu Teaser: ‘యానిమల్’ టీజర్: నాకన్నా చెడ్డవాడు లేడు - రణ్ బీర్ ఊరమాస్ అవతార్ అదుర్స్!
/body>