(Source: ECI/ABP News/ABP Majha)
Central Varsities Jobs:సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,229 జాబ్స్.. 10 లోగా నోటిఫికేషన్.. కేంద్ర మంత్రి వెల్లడి
సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 6,229 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ పోస్టుల నోటిఫికేషన్లను ఈ నెల 10లోగా వెలువరించాలని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 6,229 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేయాలని వర్సీటీల వీసీలను ఆదేశించారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను ఈ నెల 10లోగా వెలువరించాలని.. అక్టోబరు నెలాఖరు లోపు నియామక ప్రక్రియ ముగించాలని పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీల వీసీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ మేరకు వెల్లడించారు.
I thank all the VCs for their insights and valuable suggestions. I directed all our central universities to work on mission-mode to fill-up the 6,000 vacant posts, create framework for alumni endowment and establish our campuses as breeding ground for sports & job creation. pic.twitter.com/8Lbvj2AKH1
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 3, 2021
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..
ఓబీసీ - 1,767
ఎస్సీ - 1,012
ఎస్టీ - 592
ఈడబ్ల్యూఎస్ - 805
దివ్యాంగులు - 355
మాతృ భాషకు అదనంగా ఒక విదేశీ భాష..
కొత్తగా వచ్చిన విద్యా విధానం కింద భారతీయ భాషలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నూతన విద్యా విధానాన్ని వినూత్న రీతిలో అమలుచేయాల్సిన బాధ్యత యూనివర్సిటీలదే అని చెప్పారు. సమయానికి తగ్గట్లుగా కోర్సుల్లో అప్‌డేట్ చేయాల్సిన బాధ్యత వర్సిటీలదేనని తెలిపారు. మన విద్యార్థులకు మాతృ భాషతో పాటు కనీసం ఏదైనా ఒక విదేశీ భాషను నేర్చుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. దీని వల్ల ఆయా దేశాలకు వెళ్లే విద్యార్థులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Our higher education institutions are key catalysts for promoting socio-economic development and for realising aspirations and national goals. Our universities should popularise India’s rich linguistic & cultural heritage and promote learning in Indian languages.
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 3, 2021
Also Read: UGC NET 2021: యూజీసీ నెట్ పరీక్ష తేదీలు మారాయి.. రివైజ్డ్ షెడ్యూల్ వివరాలు ఇవే..