YS Kondareddy Bail : వైఎస్ కొండారెడ్డి జిల్లా బహిష్కరణ - కడప ఎస్పీ కీలక నిర్ణయం !
వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా నుంచి బహిష్కరించాలని ఎస్పీ నిర్ణయించారు. కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో ఆయనను అరెస్ట్ చేయగా బెయిల్‌పై విడుదలయ్యారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల నియోజకవర్గం చక్రాయపల్లి ఇంచార్జ్‌గా ఉన్న వైఎస్ కొండారెడ్డికి ( YS Konda Reddy ) లక్కిరెడ్డి పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను రెండు రోజుల కిందట ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించారన్న కారణంగా పోలీసులు అరెస్ట్ ( Kondareddy Arrest ) చేశారు. రెండు రోజుల్లో ఆయనకు బెయిల్ లభించింది. అయితే ఆయనపై జిల్లా బహిష్కరణ వేటు వేయాలని ఎస్పీ ( Kadapa SP ) సిఫారసు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సిఫారసును జిల్లా కలెక్టర్‌కు పంపినట్లుగా తెలుస్తోంది. దీనిపై కలెక్టర్ నిర్ణయం ఏమిటో తెలియాల్సి ఉంది.
నవరత్నాలు గుర్తు లేని అంబటి - "ఆసరా" గురించి తెలియక ఎంత ఇబ్బంది పడ్డారంటే ?
వైఎస్ కొండారెడ్డి .. వైఎస్ కుటుంబంలో ( YS Family ) కీలక వ్యక్తి. చక్రాయపేట మండలంలో అన్నీ తానై వ్యవహరిస్తూంటారు. ఈ క్రమంలో పులివెందుల- రాయచోటి మార్గంలో జాతీయ రహదారిని నిర్మిస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్లను ఆయన బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. రూ. ఐదు కోట్లు ( Five Cores ) ఇవ్వకపోతే పనులు చేయనివ్వబోమని ఆయన అనుచరులతో కలిసి అడ్డగించినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ ఛేశారు. అయితే ముఖఅయమంత్రి సన్నిహిత బంధువును అంత తేలిగ్గా అరెస్ట్ చేయరని తెర వెనుక ఏదో జరిగిందని కడప జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ ( SRK Constructions ) సంస్థ కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు వియ్యంకుడదని .. ఆయన తమకు వస్తున్న బెదిరింపుల గురించి బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. బీజేపీ హైకమాండ్ కన్నెర్ర చేయడంతోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
గుంతల్లేని రోడ్లను తయారు చేయాలి - ఏడాదిలో గణనీయ ప్రగతి కనిపించాలన్న సీఎం జగన్ !
బెయిల్ వచ్చిన వెంటనే కొండారెడ్డి రాయచోటి సబ్ జైలు ( Rayachoti Sub Jail ) నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఎస్పీ జిల్లా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి బంధువుపై ఎస్పీ ఇంత కఠిన నిర్ణయం తీసుకోరని.. పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ( CM Jagan Relative ) బంధువు అయినప్పటికీ ఆయనపై తీవ్ర అభియోగాలు వచ్చినందున జిల్లా బహిష్కరణ మంచిదని ప్రభుత్వ పెద్దలు కూడా భావించినట్లుగా తెలుస్తోంది.