Ambati Aasara : నవరత్నాలు గుర్తు లేని అంబటి - "ఆసరా" గురించి తెలియక ఎంత ఇబ్బంది పడ్డారంటే ?
ప్రభుత్వ పథకం గురించి తెలియక అంబటి రాంబాబు ఇబ్బంది పడ్డారు. అధికారిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. కానీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎదురుదాడి దిగుతారు. అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత పోలవరం ( Polavaram ) ప్రాజెక్ట్‌పై ప్రెస్ మీట్ పెట్టి అన్ని ప్రాజెక్టులకు డయాఫ్రం వాల్ ఉంటుందని ఓ సారి చెప్పి సోషల్ మీడియాలో ( Social Media ) ట్రోల్ అయ్యారు. తర్వాత పులిచింతల ప్రాజెక్టును ( Pulichintala ) గోదావరి నదిపై కట్టామని చెప్పి సోషల్ మీడియాలో టీడీపీకి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు "గడప గడపకు మన ప్రభుత్వం" పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు చేపట్టిన కార్యక్రమం తొలి రోజే ఆయన మరోసారి సోషల్ మీడియాకు చిక్కేశారు.
తీరాన్ని తాకిన అసని తుపాను, తీరంలో ఎగసిపడుతున్న రాకాసి అలలు - ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
అంబటి రాంబాబు సీఎం జగన్ ( CM jagan ) ప్రకటించిన విధంగా .. తన నియోజకవర్గం సత్తెనపల్లిలో ఇంటింటికి వెళ్లడం ప్రారంభించారు. ఇలా ఉదయమే ఓ కాలనీకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ పథకాలు పొందిన ఓ లబ్దిదారుని ఇంటికి వెళ్లారు. ఇంట్లోని మహిళను బయటకు పిలిచారు. ప్రభుత్వ పథకాలు ఏమి వస్తున్నాయో ఆరా తీశారు. ఆమె చెప్పలేకపోయింది కానీ పాంప్లెట్ చూసి అంబటి రాంబాబే పథకాల పేర్లు చెప్పడం ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ ఆసరా ( YSR Asara ) అనే పథకం దగ్గర ఆయనకే డౌట్ వచ్చింది. ఏమిటీ ఈ పథకం అని తెలుసుకోవాలనుకున్నారు. పక్కనే ఉన్న అధికారిని ఆసరా అంటే ఏమిటి అని అడిగారు. తర్వాత మహిళతో ప్రభుత్వం నుంచి రూ. నలభై వేల దాకా వచ్చాయని చెప్పి ముందుకెళ్లారు.
గుంతల్లేని రోడ్లను తయారు చేయాలి - ఏడాదిలో గణనీయ ప్రగతి కనిపించాలన్న సీఎం జగన్ !
"ఆసరా" ఏమిటి అని అంబటి రాంబాబు ( Minister Ambati ) పక్కనున్న అధికారిని అడగడం ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా పతకాలను అమలు చేస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఈ పథకాలపై అధికారులు సహా నేతలు, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలందరూ అవగాహన పెంచుకోవాలని పదే పదే చెబుతూంటారు. అయితే సాక్షాత్తూ మంత్రికే ఆసరా పథకం గురించి అవగాహన లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంబటి రాంబాబు అలా అడిగిన వీడియోను షేర్ చేస్తూ రకరకాలుగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
క్విట్ చంద్రబాబు సేవ్ ఏపీ అనే నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తాం: రోజా