అన్వేషించండి

Singayya Family: జగన్‌ను కలిసిన సింగయ్య భార్య - తర్వాత లోకేష్‌ మనషులపై ఆరోపణలు - ఈ డ్రామాలేంటని చంద్రబాబు ప్రశ్న

YSRCP: సింగయ్య కుటుంబం జగన్ ను కలిసిన తర్వాత లోకేష్ మనుషులపై ఆరోపణలు చేశారు . హత్యారాజకీయాలు చేసి ఇన్ని డ్రామాలు చేసేవాళ్లను తాను ఎప్పుడూ చూడలేదని సీఎం అన్నారు.

Singhaiah family met Jagan:  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని  ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం కలిసింది. తాడేపల్లిలోని జగన్ ఇంటికి వైసీపీ నేతలు సింగయ్య కుటుంబాన్ని తీసుకు వచ్చారు. వారికి జగన్ ఓదార్పు మాటలు చెప్పారు. తాను అండగా ఉంటానన్నారు. 

బయటకు వచ్చిన సింగయ్య భార్య లూర్దూమేరీ తన భర్త సింగయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. నా భర్తను అంబులెన్స్ లో ఎవరో ఏమో చేశారు, అందుకే చనిపోయి ఉంటాడని మాకు అనుమానంగా ఉందన్నారు. చిన్న చిన్న గాయాలకే మా ఆయన ఎలా చనిపోతాడు? .సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చి  మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటివరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడని ఆమె ప్రశ్నించారు. కొందరు వైసీపీ వాళ్లు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్దాం అంటే వద్దని అంబులెన్స్ లోనే తీసుకెళ్లారని ఆరోపించారు.  

మనుషుల్ని చంపేసి .. డ్రామాలాడుతున్నారని సింగయ్య భార్యను పిలిపించుకుని అలా చెప్పించారని సీఎం చంద్రబాబు కుప్పంలో విమర్శించారు. తన జీవితంలో ఇన్ని రాజకీయ డ్రామాలు ఎప్పుడూ చూడలేదన్నారు. హత్యా రాజకీయాలు చేస్తూ.. తప్పుడు పనులు చేసే వారి గురించి ప్రజలే ఆలోచించాలన్నారు. 

సింగయ్య భార్య ఆస్పత్రిలో బాగా మాట్లాడారని చెప్పారు.  మళ్లీ అంబులెన్స్ లో ఏదో చేశారని చెప్పారు.  ఈ విషయాలను టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నించారు. దళిత కుటుంబం పెద్ద మరణానికి కారణమవడమే  కాకుండా ఇప్పుడు ఆయన భార్యతోనూ రాజకీయాలు చేయించి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఎవరి కారు కింద పడి చనిపోయారన్న సంగతి మొదట్లో స్పష్టత లేదు. జగన్ ర్యాలీ వెళ్లిపోయిన తరవాత రోడ్డు పక్కన డివైడర్ చెట్ల పక్కన ఆయనను పడేసి వెళ్లిపోయారు. తర్వాత పోలీసులు అంబులెన్స్ ను పిలిపించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాన్వాయ్ లోని కారు కాదని..  వేరే కారు ఢీకొట్టిందని కారు నెంబర్ కూడా ప్రకటించారు. తన కారు ఢీకొట్టిందని జగన్ కూడా ప్రకటించలేదు. వైసీపీ నేతలు కూడా ప్రకటించలేదు. ఐదు రోజుల తర్వాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత జగన్ ఒప్పుకున్నారు. తన కారు కిందే పడ్డారని అందుకే తర్వాత రోజు పది లక్షల సాయం చేయమని ఆదేశించానని చెప్పారు.   అసలు జగన్ కారు కింద పడిన విషయం వీడియోలు వచ్చే వరకూ చెప్పని వైసీపీ నేతలు..  ఇప్పుడు .. కుటుంబసభ్యులను జగన్ ఇంటికి పిలిపించుకుని .. మీడియాతో అలా చెప్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget