అన్వేషించండి

AP CM Chandrababu: చంద్రబాబు జీవితంలో మరువలేని రోజు సెప్టెంబర్ 1, తొలిసారి సీఎం అయ్యి 29 ఏళ్లు పూర్తి

Andhra Pradesh | 1995లో సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. నేటితో 29 ఏళ్లు పూర్తయింది. నేడు విభజిత ఏపీకి చంద్రబాబు సీఎంగా కొనసాగుతున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. దేశ వ్యాప్తంగా సుపరిచితం. ఎన్డీఏ1లో క్రియాశీల పాత్రధారి, సూత్రధారి. దార్శనికత, ముందుచూపునకు పెట్టింది పేరు. ఆయన ఒక ఆలోచన చేశారంటే.. అది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేదిగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం ఇంతలా అభివృద్ధి చెందడం వెనుక చంద్రబాబు మాస్టర్ బ్రెయిన్ దాగి ఉందంటారు. ఇక రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రాజకీయమనే వైకుంఠపాళిలో నిచ్చెనలూ ఎక్కారు.. పాముల నోట్లోనూ పడి అథ:పాతాళానికి చేరుకున్నారు. కానీ వెరువలేదు.. వెన్నుచూపలేదు. మళ్లీ మళ్లీ నిలబడ్డారు. విజయం సాధించారు.

చంద్రబాబు జీవితంలో మరపురాని, మరిచిపోని మధురఘట్టం సెప్టెంబర్ 1. ఈ తేదీతో ఆయనకు విడదీయ రాని బంధం ఉంది. 1995లో ఇదే తేదీన తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు.  అక్కడి నుంచి ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. ఉభయ - తెలుగురాష్ట్రాలతో పాటు.. భారతదేశంలో అత్యంత సీనియర్ నేతల్లో చంద్రబాబు ఒకరు. దాదాపు 15 ఏళ్లు అధికార పక్షం.. మరో 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఆయన కీలకభూమిక పోషించారు.

రాజకీయ మేధావి..

కాలం ఆగదు.. క్యాలెండర్లో తేదీలు మారిపోతూనే ఉంటాయి.. నెలలు గడిచిపోతూనేంటాయి.. సంవత్సరాలు కరిగిపోతుంటాయి.. తిరిగి వెనక్కు చూసుకోలేనంత వేగంగా కాలం పరిగెడుతుంటుంది.. ఈ క్షణాన్ని.. ఈ రోజును సద్వినియోగం చేసుకున్నవారే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి నేతల్లో చంద్రబాబు ఒకరని చెప్పవచ్చు. 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది. 28 ఏళ్లకే ఉమ్మడి ఏపీ వంటి రాష్ట్రానికి మంత్రి అయ్యారు. రాజకీయ జీవితానికి వస్తే చంద్రబాబుది చెరగని ముద్ర వేశారు.

ఉమ్మడి ఏపీకి సీఎంగా రెండుసార్లు వరుసగా పనిచేసిన ఆయన.. దాదాపు దశాబ్దన్నర పాటు సీఎంగా సేవలు అందించారు. ఉమ్మడి ఏపీకి 1995-2004 సీఎంగా వ్యవహరించారు. అంటే.. దాదాపు 9 సంవత్సరాల 3 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014-19 మధ్య పూర్తికాలం విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించారు. ప్రస్తుతం రెండోసారి 2024 జూన్ నుంచి ఏపీకి సీఎంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని రికార్డుగా చెప్పుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడుతో పని చేసిన పార్టీ మారిన సీనియర్లు కూడా చంద్రబాబు నాయుడు విజన్ డిఫరెంట్ గా ఉంటుందని, కేంద్రంలో ప్రధానులను సైతం గతంలో నిర్ణయించిన నేతగా ఆయనకు పేరుంది. 

ప్రతిపక్షంలోనూ సుదీర్ఘంగా..

అధికారంలో ఉండి సీఎంగా మాత్రమే కాదు, ఇక ప్రతిపక్ష నేతగానూ చంద్రబాబు ఘనత సాధించారు. 1989-94, 2004-14, 2019-24 2 20 ఏళ్లకు పైగా ఆయన ప్రతిపక్ష నేతగా లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్నారు. సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు, ప్రతిపక్షనేతగా సైతం సుదీర్ఘంగా కొనసాగిన అరుదైన నేతల్లో ఒకరు. తొలిసారిగా సెప్టెంబరు 1న చంద్రబాబుకు మరుపురాని రోజు. 1995లో ఇదే రోజున ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. తనకు పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీఆర్ తో విభేదించి.. పార్టీ ఎమ్మెల్యేల బలంతో చంద్రబాబు తొలిసారి అధికారం చేపట్టారు. అలా 1995 సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. 1999 ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం అయ్యారు. అయితే, 2004, 2009 రెండు వరుస అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

విభజిత ఏపీకి 2014లో తొలి సీఎంగానూ ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. కాగా, 1995లో చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంపై అనేక విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు దీనిని వెన్నుపోటు అని అభివర్ణిస్తుంటే.. టీడీపీ మద్దతుదారులు మాత్రం పార్టీని రక్షించుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదని సమర్థిస్తుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget