కెరీర్‌లో నాలుగోసారి సీఎంగా చంద్రబాబు, ఉమ్మడి ఏపీలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలు

జూన్ 12న ఉదయం 11:27 గంటలకు కేసరపల్లిలో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం

2019- 2024 వరకు ఏపీ ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన నిలిచిన చంద్రబాబు

2014- 19 నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పాలన

వరుసగా 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షనేత హోదా

2003 అక్టోబరు 1న తిరుపతికి వెళ్తుంటే అలిపిరి వద్ద నక్సలైట్స్ బాంబు దాడితో చంద్రబాబుపై హత్యాయత్నం

1999 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి ఘన విజయంతో 2004 వరకు రెండో పర్యాయం సీఎం

సంకీర్ణ ప్రభుత్వంలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ. 2004 వరకు ఎన్డీయే జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు

దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ లను ప్రధానులుగా చేయడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు

1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం

1995 నవంబరు 1న ఉద్యోగులను పంపి ప్రజల వద్దకే పాలన, 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం



1978లో తొలిసారి ఎమ్మెల్యే, టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా
1983లో ఓటమితో టీడీపీలో చేరిక. ఆపై ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు