By: ABP Desam | Updated at : 25 Feb 2023 02:31 PM (IST)
దొంగ ఓట్లతో అధికారం - దొంగ నోట్లతో పాలన - జగన్‌పై యనమల తీవ్ర విమర్శలు !
Yanamala : దొంగ ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన దొంగ నోట్లు ముద్రించడమే జగన్ పాలసీ అని టిడిపి మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఉదయం తిరుపతిలోని ఆటోనగర్ లో ఉన్న టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర చేయడానికి అవకాశం లేదా అంటూ ఆయన అధికార పార్టిని ప్రశ్నించారు.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరి హక్కులను కాల రాస్తున్నారని, ప్రతిపక్షం ప్రజల సమస్యలను ప్రశ్నిస్తుందని, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి గానీ, ప్రతిపక్షాలను అణిచివేయడానికి కాదని ఆయన మండిపడ్డారు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ లక్ష కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. అక్రమ ఆర్జనతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని, రాష్ట్రంలో పోలీసులు ఐపిసీ ఫాలో అవడం లేదని, జేపిసీ ఫాలో అవుతున్నారని చెప్పారు.. జేపిసీ ఆధారంగా ప్రతిపక్షాలును ఇబ్బందులకు గురి చేస్తున్నారని,రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్రాలు చేసుకోవచ్చని, ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే అనవసరంగా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను, మీడియాను అణిచివేయాలని చూస్తున్నారని, ఇసుకను దోచుకుంటున్నారని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే వెళ్లి పోతుందని, ఎవరైనా పరిశ్రమలు పెట్టాలని వస్తే కమిషన్ అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.. రాష్ట్ర ట్రెజరీలో డబ్బులు లేవని, 2024లో జగన్ గెలవడని, రాబోవు కాలంలో వచ్చేది టీడీపీ అనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు.. రోడ్డులో గుంతలు పూడ్చే పరిస్థితి లేదని, రాష్ట్రంలోని అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. 11 లక్షల కోట్ల అప్పు చేసారని అదంతా ఏమి చేశారని యనమల ప్రశ్నించారు. అప్పులు చేసి... ప్రజలపై పన్నులు మోపి.. మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని యనమల మండిపడ్డారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐకి ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. తెలుగుదేశానికి గూగుల్ టేక్ ఔట్‌్ కి ఏమి సంబంధం ఉందన్నారు.. వివేకానంద రెడ్డి హత్య వెనుక..జగన్ మోహన్ రెడ్డి హస్తం వుందని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలగా దోచుకున్నారని ఆయన అన్నారు.. పాదయాత్రలో వచ్చే సమస్యలను అద్యయనం చేసి టీడీపీ మేనిఫెస్టో లో పెడాతాంమని, జగన్ పాలసీ దొంగ ఓట్లు వేసుకోవడం, అదికారంలో వున్నప్పుడు దొంగ నోట్లు ముద్రించడంమన్నారు.. జగన్ పీనల్ కోడ్ అమలు చేయడంలో తాత రాజారెడ్డిని మించిపోయారని టిడిపి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు..
Breaking News Live Telugu Updates: వడగండ్ల ప్రభావిత జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన, పంట నష్టంపై పరిశీలన
Weather Latest Update: తగ్గుముఖం పట్టిన వానలు, నేడు ఎల్లో అలర్ట్! ఉరుములు, మెరుపులు కూడా
YSRCP What Next : పట్టభద్రులిచ్చిన తీర్పుతో షాక్ - వైసీపీ దిద్దుబాటు చర్యలేంటి ? లైట్ తీసుకుంటారా ?
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!
టాలీవుడ్‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?