Roja : మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం - వైసీపీ క్యాడర్‌కు రోజా పిలుపు
YSRCP : మంచి చేసి ఓడిపోయామని రోజా సోషల్ మీడియాలో స్పందించారు. మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
Roja responded on social media that she did well and lost : ఎన్నికల ఫలితాలపై రోజా చాలా రోజుల తర్వాత స్పందించారు. కౌంటింగ్ రోజున మూడు రౌండ్లు ముగిసిన తర్వాత పరాజయం ఖాయమని తేలడంతో ఆమె కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. కొద్ది రోజుల విరామం తర్వాత సోషల్ మీడియాలో స్పందించారు. చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడిపోయాం!గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం! అని పిలుపునిచ్చారు.
చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 14, 2024
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!🔥🔥 pic.twitter.com/rZgit4c5Gq
గత పదేళ్లుగా రోజా తెలుగుదేశం పార్టీ నేతలపై దురుసుగా మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబసభ్యులపైనా అసభ్యంగా మాట్లాడారు. అదే సమయంలో మంత్రిగా ఆమెపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పెద్ద ఎత్తున అవినీతి చేశారని సీఐడీకి ఫిర్యాదు వచ్చిన రోజునే ఆమె ఇలా ట్వీట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
గత ప్రభుత్వంలో రోజా క్రీడల మంత్రిగా ఉన్నారు. తను పదవిలో ఉన్న ఆర్కే రోజా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ సిద్ధార్థ రెడ్డి.. ‘ఆడుదాం ఆంధ్ర’, ‘సీఎం కప్’ల పేరుతో చేసిన రూ. 100 కోట్ల అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. నాటి కార్యకలాపాలకు చెందిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలన్నారు. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు.
దీనికితోడు క్రీడాకారుల కోటా కింద మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందినవారిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రసాద్. అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పేపర్స్‌ను సీజ్ చేయాలని కోరారు. శాప్‌కి సంబంధించి అధికారులు చేపట్టన పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని పరిశీలించాలన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
నగరిలో రోజా రెండు సార్లు స్వల్ప తేడాతో గెలిచారు కానీ ఈ సారి మాత్రం నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.దానికి కారణంపార్టీ నేతలందర్నీ దూరం చే్సుకోవడమే. ఆమె నోటి దురుసు కారణంగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వారంతా ఆమెకు వ్యతిరేకంగా పని చేశారు. ఇక పార్టీలో ఉన్న వారు కూడా ఆమెకు వ్యతిరేకంగానే పనిచేశారు. ఓడిపోయిన తర్వాత పుత్తూరు నేతలు నగరికి పట్టిన పీడ విరగడ అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రోజా తలెత్తుకు తిరుగుతామని అంటున్నారు. నగరి నుంచే ప్రజల్లోకి వస్తారా లేకపోతే.. మరో ప్లాన్ ఏమైనా ఉందా అన్నదానిపై తర్వలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.