News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Jagan Review : 2022 జూన్‌ కల్లా రోడ్ల రిపేర్లు పూర్తి ..అధికారులకు సీఎం జగన్ ఆదేశం !

2022 జూన్ కల్లా రోడ్ల రిపేర్లు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పనులు అయిన తర్వాత కార్పెంటింగ్ చేయాలన్నారు. రిపేర్లు చేయకముందు చేసిన తర్వాత ఫోటోలు తీసి నాడు - నేడుగా చూపించాలన్నారు.

FOLLOW US: 
Share:

రాష్ట్రంలో రహదారులపై ఉన్న గుంతలు తక్షణమే పూడ్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వెంటనే పనులు ప్రారంభించంచాలని.. 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలన్నారు. పాట్‌ హోల్‌ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలని..  తర్వాత కార్పెటింగ్‌ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి రావాలన్నారు. క్యాంప్ కార్యాలయంలో  రోడ్ల పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు. 

Also Read : కొడుకు పెళ్లి కోసం ఊరికి రోడ్డు... ఓ తండ్రి ఆలోచనపై గ్రామస్తుల హర్షం

స్పెసిఫిక్‌ రోడ్లు కాకుండా రాష్ట్రం మొత్తం రిపేర్లు చేయాలని చేయండి, ఎక్కడా గుంత కనిపించకూడదని..  మేం అన్ని చేశామనే మెసేజ్‌ వెళ్ళాలన్నారు. మేజర్‌ రోడ్లకు ట్రాఫిక్‌ను బట్టి ఏ మేరకు మరమ్మత్తులు చేయాలనే దానిపై సమావేశంలో అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల వివరాలు, పనుల పురోగతిపై అధికారులను సీఎం వివరాలు అడిగారు.  అర్జెంట్‌ రిపేర్లు చేయాల్సిన పనుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఈ నెలాఖరికల్లా టెండర్లు పూర్తి చేసి 8268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మత్తులు వెంటనే మొదలుపెడుతున్నట్లు అధికారుల సీఎంగా తెలిపారు. 

Also Read : కుప్పంలో రచ్చ - మిగతా చోట్ల చెదురుమదురు ఘటనలు .. ముగిసిన ఏపీ మినీ లోకల్ వార్

అయితే మొత్తం 46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా తీసుకోవాలని..  ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు.  వర్షాలు తగ్గగానే డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకు అన్ని రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు కూడా కవర్‌ చేయాలని..న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు పనులు ప్రారంభించకపోతే వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. 

Also Read : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం... ప్రజావ్యతిరేకత తట్టుకోలేక కుట్రలు... వైసీపీపై చంద్రబాబు ఫైర్

ఏ రోడ్డు అయినా సరే మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ అయినా సరే ఎవరి పరిధిలో ఉన్నా వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు, మెయింటెనెన్స్‌ మీద ముందు దృష్టి పెట్టండి, నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలని సూచించారు. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు ఏపీకి సంబంధించి పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  

Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Nov 2021 06:34 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan AP roads Roads Review Road Repairs Potless Roads

ఇవి కూడా చూడండి

TTD News: శోభాయమానంగా శ్రీవారి స్నపన తిరుమంజ‌నం, బంగారు గొడుగు ఉత్సవం

TTD News: శోభాయమానంగా శ్రీవారి స్నపన తిరుమంజ‌నం, బంగారు గొడుగు ఉత్సవం

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు

Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు

టాప్ స్టోరీస్

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

ABP-CVoter Snap Poll: మహిళా రిజర్వేషన్లపై సామాన్యుల రియాక్షన్‌ ఇదే- ఏబీపీ సీఓటర్‌ సర్వే ఫలితాలు

ABP-CVoter Snap Poll: మహిళా రిజర్వేషన్లపై సామాన్యుల రియాక్షన్‌ ఇదే- ఏబీపీ సీఓటర్‌ సర్వే ఫలితాలు

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

NASA OSIRIS-REx: భూమిని చేరిన గ్రహశకలం నమూనా- ఫలించిన ఏడేళ్ల నిరీక్షణ, నాసా మొదటి మిషన్‌ సక్సెస్

NASA OSIRIS-REx: భూమిని చేరిన గ్రహశకలం నమూనా- ఫలించిన ఏడేళ్ల నిరీక్షణ, నాసా మొదటి మిషన్‌ సక్సెస్